రెస్క్యూ ఆపరేషన్‌కి వెళ్లి 11 మంది ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గల్లంతు
ABN , Publish Date - Nov 04 , 2026 | 08:31 PM
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్డీఆర్‌ఎఫ్ బృందం ఉన్న రెండు బోట్లు గల్లంతయ్యాయి.
ఖమ్మం జిల్లా, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్డీఆర్‌ఎఫ్ బృందం ఉన్న రెండు బోట్లు గల్లంతయ్యాయి. తొలుత బేతుపల్లి చెరువులో 8మంది మత్స్యకార సొసైటీ సభ్యులు చిక్కుకుపోయారు. వీరిని కాపాడేందుకు ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF) సిబ్బంది వెళ్లారు. ముందుగా ముగ్గురిని ఎస్డీఆర్‌ఎఫ్ బృందం కాపాడింది. మరో ఐదుగురిని కాపాడే ప్రయత్నంలో అలుగులో రెండు ఎస్డీఆర్‌ఎఫ్ బోట్లు గల్లంతయ్యాయి. ప్రమాద సమయంలో రెండు బోట్లలో 11మంది ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఎస్డీఆర్‌ఎఫ్ బృందం కోసం మరో బోటు సాయంతో మరో సిబ్బంది గాలిస్తున్నారు..
అంతకుముందు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో నీటిలో 8 మంది మత్స్యకార సొసైటీ సభ్యులు చిక్కుకుపోయారు. బేతుపల్లి చెరువుకు అలుగుపడటంతో చాపలు కొట్టుకుపోకుండా వల కట్టేందుకు వెళ్లి వరద ఉధృతికి సొసైటీ సభ్యులు నీటిలో చిక్కుకుపోయారు. వీరి కోసం తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. అధికారులను ఆదేశించారు. ఒక బోటులో ముగ్గురు సొసైటీ సభ్యులను సురక్షితంగా రెస్క్యూ టీం ఒడ్డుకు చేర్చింది. రెండు బోట్లతో ఐదుగురు సొసైటీ సభ్యులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు రెస్క్యూ టీమ్ వెళ్లింది. చెరువులో గల్లంతైన ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు చేపడుతున్న సహాయక చర్యలను ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి బేతుపల్లి చెరువుకు వరద పోటెత్తుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్ హయాంలో తెలంగాణ సొత్తును కొల్లగొట్టారు.. మంత్రి పొంగులేటి ధ్వజం
సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్
బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News