Share News

అందరూ సేఫ్‌

ABN , Publish Date - Nov 06 , 2026 | 04:58 AM

తీవ్ర ఉత్కంఠకు దారితీసిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి పెద్దచెరువు ఘటన సుఖాంతమైంది.

అందరూ సేఫ్‌
Ponguleti Srinivas Reddy

  • బేతుపల్లి చెరువు ఘటన సుఖాంతం

  • సురక్షితంగా ఒడ్డుకు చేరిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

  • అభినందించిన మంత్రులు తుమ్మల, పొంగులేటి

సత్తుపల్లి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): తీవ్ర ఉత్కంఠకు దారితీసిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి పెద్దచెరువు ఘటన సుఖాంతమైంది. అలుగు వరదల్లో చిక్కుకున్న మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లి.. బోట్లు తిరగబడడంతో కొట్టుకుపోయిన 10 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, వారికి సాయంగా వెళ్లిన స్థానికుడిని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కాపాడారు. వారందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సుమారు 12గంటల పాటు జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌ గురువారం ఉదయం 5:30 గంటలకు ముగిసింది. బేతుపల్లి పెద్దచెరువు అలుగు పోస్తుండడంతో చేపలు బయటకు వెళ్లిపోకుండా వలలు అడ్డుగా పెట్టేందుకు బుధవారం సాయంత్రం 8మంది మత్స్యకారులు అక్కడికి వెళ్లి చిక్కుకుపోవడం, వారిని కాపాడేందుకు వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎస్‌ సిబ్బంది వరదలో కొట్టుకుపోవడం తెలిసిందే. దీంతో ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ సిబ్బందిని రప్పించి కొట్టుకుపోయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.


మరోవైపు ఇతర బృందాలతో అలుగు వద్ద చిక్కుక్ను మత్స్యకారులందరినీ బయటకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి సమయానికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి చెందిన సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ద్వారా వారున్న లొకేషన్‌ను అధికారులు గుర్తించారు. అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో ఐదుగురిని, తెల్లవారుజామున మరో ఐదుగురిని గుర్తించి కాపాడారు. మరో వ్యక్తిని కాపాడేందుకు సాంకేతికంగా సాధ్యం కాకపోవడంతో తాడు సాయంతో అతడిని ఒడ్డుకు చేర్చారు. మొత్తంగా ఉదయం 5:30 గంటలకు రెస్క్యూ ఆపరేషన్‌ ముగిసింది. రాత్రంతా చెట్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నామని ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది తెలిపారు. చెప్పారు. వారందరినీ వెంటనే సత్తుపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాణాలకు తెగించి బాధితులను కాపాడిన ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించారు. గురువారం ఉదయం వారు వేర్వేరుగా సంఘటనా స్థలాన్ని సందర్శించి ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని సన్మానించారు. సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని పరామర్శించారు. బుధవారం రాత్రి మొత్తం క్షేత్ర స్థాయిలో ఉండి సహాయక, గాలింపు చర్యలను పర్యవేక్షించిన ఖమ్మం కలెక్టర్‌ దివాకర, భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయిలను అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ బ్రాండ్‌ ప్రపంచానికి చాటాలి

మరో రెండు పథకాలు

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 04:58 AM