Share News

తీర్థయాత్రల స్పెషల్‌ ప్యాకేజీలతో ఆర్టీసీకి ఆదాయం

ABN , Publish Date - Jun 12 , 2026 | 01:05 PM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రవేశపెట్టిన తీర్థయాత్రల స్పెషల్‌ ప్యాకేజీలకు ప్రయాణీకుల నుంచి ఆదరణ లభిస్తున్నది.

తీర్థయాత్రల స్పెషల్‌ ప్యాకేజీలతో ఆర్టీసీకి ఆదాయం
TGSRTC special tours

  • రీజియన్‌ వ్యాప్తంగా 406 ట్రిప్పులు

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రవేశపెట్టిన తీర్థయాత్రల స్పెషల్‌ ప్యాకేజీలకు ప్రయాణీకుల నుంచి ఆదరణ లభిస్తున్నది. కరీంనగర్‌ రీజియన్‌ వ్యాప్తంగా ఆర్టీసీలో 11 డిపోలు ఉన్నాయి. జూన్‌ 27, 2025 నుంచి తీర్థయాత్రల ప్యాకేజీలు ప్రారంభించారు. ఈ నెల 7 వరకు రీజియన్‌ వ్యాప్తంగా 406 బస్సులను నడిపించి 1,35,76,680 రూపాయల ఆదాయం సమకూరింది.


రీజియన్‌ వ్యాప్తంగా ప్యాకేజీలు

కరీంనగర్‌ రీజియన్‌ వ్యాప్తంగా అన్ని డిపోల నుంచి వివిధ ప్రాంతాలకు తీర్థయాత్రలు, విహార యాత్రల ప్యాకేజీలు నిర్వ హించారు. కరీంనగర్‌ రీజి యన్‌లోని 11 డిపోల నుంచి అరుణాచలం, యాదగిరిగుట్ట, జరాసం ఘం, బీదర్‌, విశాఖపట్నం, గోవా, అన్నవరం, గానుగాపూర్‌, ఏడుపాయలు, అయోధ్య, ఊటీ వంటి దూర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నడిపించింది.


jgl1.3.jpgరీజీయన్‌ వాప్తంగా సమకూరిన ఆదాయం

కరీంనగర్‌ రీజియన్‌ వ్యాప్తంగా గోదావరిఖని డిపో 55 బస్సులను నడిపించి 18,51,987 రూపాయలు, హుస్నాబాద్‌ డిపో 23 బస్సులను నడిపించి 7,35, 742, హుజూరాబాద్‌ డిపో 26 బస్సులను నడిపించి 8,05,045, జగిత్యాల డిపో23 బస్సులతో 7,42,887 రూపాయలు ఆర్జించాయి. కరీంనగర్‌-1 డిపో 48 బస్సులతో 19,03, 810, కరీంనగర్‌-2 డిపో 59 బస్సులతో 20,44,964, కోరుట్ల డిపో 57 బస్సులతో 17,08,535, మంథని డిపో 29 బస్సులతో 8,75,191 మెట్‌పల్లి డిపో 28 బస్సులతో 10,45,638, సిరిసిల్ల డిపో 30 బ స్సులతో 9,62,088, వేములవాడ డిపో 28 బస్సు లతో 9,00, 793 రూపాయాల ఆదాయం సమ కూర్చుకున్నది.


ప్రయాణికుల ఇష్టాన్ని బట్టి బస్సులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో తీర్థయాత్రల ప్యాకేజీలో భాగంగా ప్రయాణికుల ఇష్టాన్ని బట్టి వివిధ ప్రాంతలకు ఆర్టీసీ అధికారులు బస్సులను కేటాయిస్తున్నారు. కమ్యూనిటీలు, కాలనీల వాసులు తాము అనుకున్న ప్రదేశానికి తీర్థయాత్రలతోపాటు, పర్యాటక కేంద్రాలకు వెళ్లాలనుకుంటే ఆర్టీసీ అధికారులను సంప్రదిస్తే ప్యాకేజీ రేట్లను బట్టి బస్సులను కేటాయిస్తామని అధికారులు తెలిపారు.


తీర్థయాత్రల ప్యాకేజీని వినియోగించుకోవాలి

  • ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ బి రాజు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీర్థయాత్రల ప్యాకేజీలను ప్రయాణికులు వినియోగించుకోవాలి. తీర్థయాత్రల ప్యాకేజీలకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తుంది. ప్రయాణికులు కోరిన విధంగా పుణ్యక్షేత్రాలతోపాటు, పర్యాటక కేంద్రాలకు బస్సులను కేటాయిస్తాము.


ఈ వార్తలు కూడా చదవండి:

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి

ఈ-సైకిళ్లకు యమ డిమాండ్‌..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 12 , 2026 | 01:08 PM