Share News

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మళ్లీ చిరుత సంచారం.. భయాందోళనలో విద్యార్థులు

ABN , Publish Date - Jun 12 , 2026 | 10:21 AM

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో మళ్లీ చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మళ్లీ చిరుత సంచారం.. భయాందోళనలో విద్యార్థులు
Tirupati Leopard,

తిరుపతి, జూన్ 12: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) క్యాంపస్‌లో మళ్లీ చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. యూనివర్సిటీ ప్రాంగణంలోని ఐ (I) బ్లాక్, జీ (G) బ్లాకుల మధ్య చిరుత తిరుగుతుండటాన్ని విద్యార్థులు గమనించారు. దీంతో క్యాంపస్‌లో ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. హాస్టల్ సమీపంలోని బ్లాకుల మధ్య చిరుత కనిపించడంతో భయభ్రాంతులకు గురైన విద్యార్థులు.. వెంటనే విశ్వవిద్యాలయ అధికారులు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే, ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే.. ఆ చిరుత పక్కనే ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది.


శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ క్యాంపస్ శేషాచలం అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉండటంతో వన్యప్రాణుల సంచార ఘటనలు తరచూ చోటు చేసుకుంటూనే ఉంటాయి. గత ఏడాది కాలంలోనే క్యాంపస్ పరిసరాల్లో మూడు చిరుత పులులను అటవీ శాఖ అధికారులు బంధించారు. వాటిని సురక్షితంగా అడవుల్లోకి వదిలిపెట్టారు. ఇలా వరుసగా చిరుతలు పట్టుబడుతున్నా, మళ్లీ కొత్తగా చిరుత జాడలు కనిపించడం విశ్వవిద్యాలయ విద్యార్థులను, సిబ్బందిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది


ఇవి కూడా చదవండి..

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేశ్

26, 28 తేదీల్లో చెన్నై-తిరుపతి రైళ్ల రద్దు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 12 , 2026 | 11:16 AM