Share News

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేశ్

ABN , Publish Date - Jun 12 , 2026 | 09:02 AM

మంత్రి నారా లోకేశ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. వైసీపీ నేతల చేతిలో హత్యకు గురైన తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేస్తూ, ఆయన కుమారుడు వీరాంజనేయులుకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేశ్
Nara Lokesh Promise Fulfilled

అమరావతి: మంత్రి నారా లోకేశ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మరోసారి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. వైసీపీ నేతల చేతిలో హత్యకు గురైన పల్నాడు జిల్లా గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేత తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేశారు. 'కార్యకర్తే అధినేత' అన్న మాటను నిజం చేశారు.


తోట చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులుకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు. మండలిలో వైసీపీ అడ్డంకులు సృష్టించినప్పటికీ, చివరకు ప్రభుత్వ ఉద్యోగానికి ఆమోదం పొంది ఆయనకు అధికారికంగా అపాయింట్‌మెంట్ లెటర్ అందజేశారు. ఈ సందర్భంగా తోట వీరాంజనేయులు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తన కుటుంబానికి న్యాయం జరిగిందని ఆయన భావోద్వేగంగా స్పందించారు.


కాగా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఎంపీపీగా ఉన్న చింతా శివరామయ్య, అతని కుమారుడు ఆదినారాయణల అక్రమాలపై టీడీపీ నేత తోట చంద్రయ్య పోరాటం చేశారు. దీంతో కక్షగట్టిన వారిద్దరూ.. 2022 జనవరి 13న గ్రామంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చంద్రయ్యను నడిరోడ్డుపై కత్తులతో గొంతు కోసి ప్రాణం తీశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే..

తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించగా, దీనిని వైసీపీ వ్యతిరేకించింది. మండలిలో బిల్లును అడ్డుకుంది. రాజకీయ ప్రేరేపిత ఘర్షణలో మృతి చెందిన తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రభుత్వం చట్టాన్ని సవరించాల్సి వచ్చింది. న్యాయ శాఖ గెజిట్ జారీ చేయడంతో తోట చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులుకు ఉద్యోగం ఇవ్వడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. వీరాంజనేయులుకు జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ ఏపీ ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం, వెండి ధరలు.. నేడు ఎలా ఉన్నాయంటే..

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

Read Latest AP News 

Updated Date - Jun 12 , 2026 | 09:22 AM