Share News

కనిపించని జ్ఞానేశ్వరి జాడ.. భర్త స్నేహితులపై పాప తల్లి అనుమానం

ABN , Publish Date - Jun 12 , 2026 | 11:42 AM

కాకినాడ జిల్లాలో కలకలం రేపిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఏడు రోజులు దాటినా చిన్నారి జాడ కనిపించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

కనిపించని జ్ఞానేశ్వరి జాడ.. భర్త స్నేహితులపై పాప తల్లి అనుమానం
Gnaneswari Missing Case

కాకినాడ, జూన్ 12: కాకినాడ జిల్లాలో కలకలం రేపిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఏడు రోజులు దాటినా చిన్నారి జాడ కనిపించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చిన్నారి జాడను కనిపెట్టేందుకు పెంపుడు కుక్కకు పోలీసులు జీపీఎ‌స్ ట్రాకర్ అమర్చారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి జీపీఎస్ ట్రాకర్‌ను అధికారులు తెప్పించారు. కుక్కను ట్రాక్ చేసి అది వెళ్లే మార్గంలో చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు భర్త స్నేహితులపై చిన్నారి తల్లి అనుమానాలు వ్యక్తం చేస్తోంది. తన పాపను భర్త స్నేహితులే తీసుకెళ్లి ఉండొచ్చని తల్లి అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు.. చిన్నారి తండ్రి స్నేహితులను విచారించారు. వారి నుంచి కూడా ఎలాంటి సమాచారం లభించనట్లు సమాచారం.


చుట్టుపక్కల గ్రామాల్లో సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద కదలికలు, చిన్నారిని ఎవరైనా తీసుకెళ్లారా అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గడిచిన ఏడు రోజులుగా చిన్నారి ఆచూకీ కోసం వందలాది మంది పోలీసులు మోహరించి గాలిస్తున్నప్పటికీ... చిన్నారి జాడ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిడ్డ కోసం తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.


ఇవి కూడా చదవండి..

రాబోయే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచం: మంత్రి గొట్టిపాటి రవికుమార్

వారి భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 12 , 2026 | 12:28 PM