వారి భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jun 12 , 2026 | 10:50 AM
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. గత ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వదిలి వెళ్తే.. అన్నింటినీ అధిగమిస్తూ సుపరిపాలనను అందిస్తున్నామన్నారు.
అమరావతి, జూన్ 12: ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. గత ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వదిలి వెళ్తే.. అన్నింటినీ అధిగమిస్తూ సుపరిపాలనను అందిస్తున్నామన్నారు. రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రాభివృద్ధిలో సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.
రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు: సీఎం
‘ఐదు కోట్ల మంది ప్రజల అపార నమ్మకంతో ప్రజాప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు. గత ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వదిలి వెళ్తే... అన్నింటినీ అధిగమిస్తూ సంక్షేమం - అభివృద్ధి - సుపరిపాలన అందిస్తున్నాం. అధికారాన్ని బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నాం. ప్రతి పౌరుడిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వర్గాన్ని గెలిపించడమే అజెండాగా పని చేస్తున్నాం. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ... రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాం. రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్రాభివృద్ధిలో అడుగడుగునా సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నాను. అటు కేంద్ర ప్రభుత్వ సహకారం, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ రెండేళ్ల ప్రయాణంలో అండగా ఉన్న రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు ప్రజల మద్దతు, సహకారం కోరుతూ...జై ఆంధ్రప్రదేశ్!’ అంటూ సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్... తాడిపత్రిలో ఉద్రిక్తం
రాబోయే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచం: మంత్రి గొట్టిపాటి రవికుమార్
Read Latest AP News And Telugu News