Share News

గీత కార్మికుల ప్రాణాలకు భరోసా ఏది?

ABN , Publish Date - Aug 04 , 2026 | 11:48 AM

గీత కార్మికు లు ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు. ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచాల వినియోగంపై శిక్షణ ఇవ్వడంతో గీత కార్మికులకు తమ ప్రాణాలపై కొంత భరోసాను కల్పించింది.

గీత కార్మికుల ప్రాణాలకు భరోసా ఏది?
Karimnagar News, Hyderabad

  • ప్రమాదాల బారిన పడి మృత్యువాత

  • రక్షణ కవచాల వినియోగంలో పూర్తికాని శిక్షణ

ఓదెల(కరీంనగర్): గీత కార్మికులు ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు. ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచాల వినియోగంపై శిక్షణ ఇవ్వడంతో గీత కార్మికులకు తమ ప్రాణాలపై కొంత భరోసాను కల్పించింది. మండలంలోని ఓదెల, కనగర్తి, కొలనూర్‌ గ్రామాల్లో గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాల వినియోగంపై ట్రైనర్లు ఫైలట్‌ ప్రాజెక్టుగా కొందరికి శిక్షణ ఇచ్చారు. కాని మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పూర్తిస్థాయిలో గీత కార్మి కులకు శిక్షణ పూర్తి చేయలేదు. అందరికీ శిక్షణ ఇస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండేదని అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి.


గీత వృత్తిని నమ్ముకొని బతుకుతున్న గౌడ కులస్తుల ప్రాణాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొందరికి శిక్షణ ఇచ్చింది. అనంతరం జిల్లాల్లో, మండలాల్లో అమలు చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ఫైలట్‌ ప్రాజెక్టుగా కొన్ని మండలాలు, గ్రామాలను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చింది. ఈ శిక్షణలో భాగంగా కొందరిని ఎంపిక చేసిన వారికి మాత్రం శిక్షణ ఇవ్వడంతో మిగతా వారికి శిక్షణ అందలేదు. శిక్షణ ఇచ్చిన మేరకు కాటమయ్య రక్షణ కవచాల కిట్లను కూడా పంపిణీ చేశారు. అయినప్పటికీ కొందరు తాటి చెట్లపై నుంచి జారిపడి ప్రాణాలు పోతుండగా మరి కొందరు దివ్యాంగులుగా మారి ఇంటికే పరిమితమవుతున్నారు.


geeta1.jpgఇటీవల ఓదెలకు చెందిన ఐలు బిక్షపతి అనే కార్మికుడు తాటిచెట్టుపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు రూపు నారాయణపేట, మడక, కొమిర, గుంపుల కొలనూర్‌తో పాటు తదితర గ్రామాల్లో తాటి చెట్లు ఎక్కి కిందికి దిగుతుండగా మోకులు జారిపడి కాళ్లు,చేతులు విరిగి పలువురు దివ్యాంగులుగా మారారు. దీంతో వారి కుటుంబాలు దీనస్థితికి చేరాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


geeta2.jpgగీత కార్మికులకు వృత్తి భద్రత కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచం పథకా న్ని 2024 జూలై14న అధికారికంగా ప్రారంభించారు. ఈ రక్షణ కవచం గౌడ కులస్తులందరికీ ఆశాజనకంగా కనిపించింది. కానీ ఆశించిన మేరకు శిక్షణ లేకపోవడంతో ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.9 లక్షల మంది గీత కార్మికులు ఉన్నారనే ప్రభుత్వ అంచన కాగా ఇప్పటివరకు 10 వేల కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేయగా, ఓదెల మండలంలో రెండు వందల కిట్లను పంపిణీ చేశారు. బాధిత కుటుం బాలకు ఎక్స్‌గ్రేషియా అంతంత మాత్రమే అందుతోంది.


ప్రభుత్వం గీత కార్మికుల ప్రాణాలకు భరోసా కల్పించాలి

  • శాతాళ్ల రోహిత్‌, సామాజిక కార్యకర్త, ఓదెల

గీత కార్మికుల రక్షణ కోసం కాటమయ్య రక్షణ కవచం పథకాన్ని పటిష్టంగా అమలు చేసి కార్మికులకు భరోసా కల్పించాలి. అర్హత ఉన్న ప్రతీ గౌడ కులస్తు నికి రక్షణ కిట్ల వినియోగంలో పూర్తిస్థాయిలో సమగ్ర శిక్షణ ఇవ్వాలి. ప్రమాదవశాత్తు వారి ప్రాణాలు పోకుండా శాశ్వత కార్యాచరణ రూపొందించి, వృత్తిలో భాగంగా ప్రాణాలు పోయిన బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

అన్నదాతకు వరం.. పీఎం కిసాన్ మాన్‏ధన్

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 5న తాగునీటి సరఫరా బంద్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 04 , 2026 | 11:48 AM