దడ పుట్టిస్తున్న సన్న బియ్యం
ABN , Publish Date - Sep 29 , 2026 | 12:30 PM
సన్నబియ్యం ధరలు మార్కెట్లో దడ పుట్టిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వానాకాలం సీజన్‌లో సన్నరకం ధాన్యం సాగు తగ్గడం,
ఇప్పటికే కిలో రూ. 74 నుంచి రూ. 85కు చేరిన ఆర్‌ఎన్‌ఆర్ రకం
కొద్ది రోజుల్లో మరింత పెరిగే అవకాశం
హుజూరాబాద్(కరీంనగర్): సన్నబియ్యం ధరలు మార్కెట్లో దడ పుట్టిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వానాకాలం సీజన్‌లో సన్నరకం ధాన్యం సాగు తగ్గడం, భవిష్యత్తులో ధాన్యం కొరత ఏర్పడనుందనే అంచనాలతో వ్యాపారులు ముందుగానే సన్న ధాన్యం నిల్వ చేసి పెడుతుండడంతో మార్కెట్లో ధరలు రోజురోజూకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆర్‌ఎన్‌ఆర్ వంటి సన్నరకం బియ్యం హోల్‌సెల్ ధర కిలోకు 74 నుంచి 85 రూపాయల వరకు పలుకుతోంది. ప్రస్తుతం ధాన్యం నిల్వలపై ని యంత్రణ లోపం, మిల్లర్ల సమస్యల కార ణంతో పెరుగుతున్న బియ్యం ధర కొద్ది రోజుల్లోనే పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
సన్న రకాల సాగు నిబంధన...
ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వానా కాలంలో ప్రభుత్వం సన్నరకాలే సాగు చేయాలని, అది కూడా ఏడు రకాలకే రాయితీ ఇస్తామని చెప్పినా రైతులు మాత్రం సన్న ధాన్యం సాగుకు అంతంత మాత్రం గానే ముందుకు వచ్చారు. కొద్దిగా సాగైన స న్నాలకు సైతం ఈ సారి కొత్త రకం చీడ పీడలు ఆశించి పంట దెబ్బతింటోంది. మరో 20 శాతం పొ లాలు నీటి ఎద్దడి, విద్యుత్తు కోతల కారణంగా దె బ్బతింటున్నాయి. ఈ కారణాలన్నీ పంట దిగు బడిపై ప్రభావం చూపుతున్నాయి.
రేషన్ బియ్యానికి డిమాండ్
రాష్ట్రప్రభుత్వం పేదలకు రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ ప్రా రంభించాక బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు తగ్గుముఖం పట్టాయి. నూకలు ఎక్కువగా వస్తుండడంతో దిగువ, మధ్య తరగతి ప్రజలు రేషన్ బియ్యం తినడం తగ్గించారు. ఈ బి య్యాన్ని దళారులకు విక్రయించి దుకాణాల్లో ఫైన్ క్వాలీటీ బియ్యం కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.
బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలకు డిమాండ్ పెరగడంతో రేషన్‌కార్డు దారుల నుంచే వ్యాపారులు 22 నుంచి 25 రూపాయల ధరకు సేకరిస్తున్నారు. వాటిని దళారులకు 30 రూపాయ లకు విక్రయిస్తున్నారు. వారు బియ్యాన్ని పాలిష్ పట్టి, తిరిగి బహిరంగ మార్కెట్లో ఏదో ఒక బ్రాండ్ పేరుతో కిలో 50 రూపాయలకు విక్రయిస్తున్నారు. మార్కెట్లో పైన్ క్వాలిటీ రైస్ ధరలు పెరగడంతో రేషన్ బియ్యానికి డిమాండ్ వచ్చింది.
బియ్యం ధరలను అదుపు చేయాలి
కాసబోయిన కిరణ్, కాట్రపల్లి
బియ్యం ధరలను చూస్తుంటే భయం వేస్తోంది. రోజు రోజుకి బియ్యం ధరలు పెరుగుతూ పోతే సామన్య ప్రజలకు ఆర్థిక భారం పెరుగుతుంది. ఇంటి బడ్జెట్‌ను రూపొం దించుకొని మధ్య తరగతి ప్రజలు పెరుగుతున్న బియ్యం ధరలతో అవస్థలు పడుతున్నారు.
రేషన్ బియ్యంలో నూక ఎక్కువగా వస్తోంది
బోయిని సమ్మక్క, కనుకులగిద్దె
రేషన్ బియ్యంలో నూక ఎక్కువగా వస్తోంది. రేషన్ బియ్యాన్నే వండుకుం టున్నా. బియ్యంలో నూక రాకుండా ప్రభుత్వం జర దృష్టి పెట్టాలి. బయట బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి.
ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలి...
బింగి కరుణాకర్, రంగాపూర్.
రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాల సాగుపై నిబంధనలు పెట్టడంతో సన్న బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వ్యాపా రులు బియ్యం ధరలను పెంచే స్తున్నారు. ప్రభుత్వం సన్న బియ్యం ధరలను నియంత్రించాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు పూర్తి.. అధిష్ఠానానికి ఆరుగురి పేర్లు
సచివాలయ ఉద్యోగులకు 15వేలకు పైగా ప్రమోషన్లు ఇచ్చాం: మంత్రి డోలా
Read Latest AP News And Telangana News And International News And Telugu News