బలోచ్ ఆర్మీ మహిళా దళం.. 9 మంది పాక్ సైనికులు ఖతం.. వైరల్ వీడియో
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:40 AM
పాక్ పాలకుల నుంచి బలోచిస్థాన్‌ను విముక్తం చేసేందుకు పోరాడుతున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఇటీవల మహిళ సైనికుల దళం కరీమా ఆర్మ్‌డ్ అసాల్ట్ డివిజన్‌ను (కాడ్) ఏర్పాటు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: పాక్ పాలకుల నుంచి బలోచిస్థాన్‌ను విముక్తం చేసేందుకు పోరాడుతున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఇటీవల మహిళ సైనికుల దళం కరీమా ఆర్మ్‌డ్ అసాల్ట్ డివిజన్‌ను (కాడ్) ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. ఈ దళం తాజాగా చేసిన దాడిలో 9 మంది పాక్ మిలిటరీ సిబ్బంది మరణించారని కూడా బీఎల్ఏ వెల్లడించింది.
కలాట్ ఆపరేషన్ పేరిట పాక్ మిలిటరీ సిబ్బందికి చెక్ పెట్టామని బలోచ్ ఆర్మీ పేర్కొంది. బీఎల్ఎఫ్ రిలీజ్ చేసిన వీడియోలో మహిళా సైనికుల శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయి. టుర్బాట్‌లో పాక్ సైనికులను మట్టుపెట్టేందుకు ఉద్దేశించిన ఈ మిషన్‌కు ముందు వీడియోను తీశారు. మిషన్ లక్ష్యాలు, వ్యూహం గురించి ఓ మహిళ కమాండర్ తమ దళ సభ్యులకు వివరిస్తున్న వైనం వీడియోలో రికార్డైంది.
ఈ సందర్భంగా కాడ్ బృందం మహిళా సైనికులు సమీపంలో వాహనాలను తనిఖీ చేసిన దృశ్యాలు కూడా రికార్డయ్యాయి. తాజా ఆపరేషన్ ఈ గ్రూప్ నిర్వహించిన రెండో కార్యక్రమమని బలోచ్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. తమ దళం సామర్థ్యాలు, విజయాలను చాటిచెప్పేందుకు బీఎల్ఏ ఈ వీడియోను షేర్ చేసింది. అయితే, కాడ్ సభ్యుల తాజా దాడిలో ఎందరు పాక్ సైనికులు మృతి చెందారన్నది పూర్తిస్థాయిలో నిర్ధారణ కావాల్సి ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
అది సుంకాల ఎఫెక్ట్.. భారతీయ స్టీల్‌ప్లాంట్‌పై యూఎస్ మంత్రి కామెంట్
అమెరికా మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో బిష్ణోయ్ గ్యాంగ్ లీడర్