కేటీఆర్‌ను విమర్శించే స్థాయి బండి సంజయ్‌కి లేదు: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
ABN , Publish Date - May 07 , 2026 | 11:33 AM
భార్య పుస్తెలు అమ్మి పోటీ చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కోట్ల రూపాయలు ఎక్కడివని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. బండి సంజయ్‌కు రేవంత్ రెడ్డి డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు.
కరీంనగర్, మే 7: కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. రేవంత్ ఏది మాట్లాడితే.. బండి సంజయ్ అదే మాట్లాడుతున్నారని తెలిపారు. బండి సంజయ్ తిట్టాల్సింది కేటీఆర్‌నా .. రేవంత్ రెడ్డినా అని ప్రశ్నించారు. బంగారం షాపులో దొంగతనం జరిగితే ప్రభుత్వానికి బాధ్యత లేదా అని నిలదీశారు. రేవంత్‌ను సంజయ్ ఒక్క మాట కూడా ఎందుకు అనడం లేదని అన్నారు.
భార్య పుస్తెలు అమ్మి పోటీ చేసిన బండి సంజయ్‌కు కోట్ల రూపాయలు ఎక్కడివని ఎమ్మెల్యే ప్రశ్నించారు. బండి సంజయ్‌కు రేవంత్ రెడ్డి డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్‌ను విమర్శించే స్థాయి కేంద్ర మంత్రికి లేదన్నారు. బండి సంజయ్‌కు దమ్ముంటే కేటీఆర్‌తో చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేటీఆర్‌ను ఇష్టం వచ్చినట్టు తిడితే ఊరుకునేది లేదన్నారు. బండి సంజయ్‌ను కూడా తాము తిట్టగలమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి...
విశాఖలో ‘అల్లూరి స్ఫూర్తి యాత్ర’.. పాల్గొన్న పీవీఎన్ మాధవ్
భూ వివాదాల్లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తాం: మంత్రి అనగాని సత్యప్రసాద్
Read Latest Telangana News And Telugu News