Share News

కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సు దగ్ధం

ABN , Publish Date - Jun 21 , 2026 | 09:27 AM

కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం అలుగునూరు శివారులో జరిగిన ఈ ఘటనలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సు దగ్ధం
RTC Bus Accident

కరీంనగర్ జిల్లా, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం అలుగునూరు శివారులో జరిగిన ఈ ఘటనలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, సిబ్బంది బస్సును ఆపి ప్రయాణికులను దింపేశారు. ప్రయాణికులు సమయానికి బస్సు నుంచి బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.


ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే బస్సు మాత్రం మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు సమాచారం అందించగా అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ బస్సు పూర్తిగా కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. ఎలక్ట్రిక్ బస్సులో మంటలు ఎలా చెలరేగాయనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనతో కరీంనగర్ –హైదరాబాద్ మార్గంలో ప్రయాణాలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది.


ఈ వార్తలు కూడా చదవండి...

నీట్ అభ్యర్థులు ఒత్తిడికి లోనుకాకుండా పరీక్ష రాయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

27 లక్షల మంది విద్యార్థులకు విజయ పాలు అందిస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 21 , 2026 | 01:25 PM