Share News

గుబులు పుట్టిస్తున్న ఎల్‏నినో

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:11 PM

పన్నెండు లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేసిన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రైతులను ఎల్‌నినో కంటిపై కునుకు లేకుండా చేస్తున్నది.

గుబులు పుట్టిస్తున్న ఎల్‏నినో
El Nino impact Telangana

  • రోజురోజుకు పెరుగుతున్న ఎండలు

  • నిండని ప్రాజెక్టులు, చెరువులు

  • వానాకాలం పంటలు చేతికి వచ్చేనా...!

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

పన్నెండు లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేసిన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రైతులను ఎల్‌నినో కంటిపై కునుకు లేకుండా చేస్తున్నది. రోజురోజుకు పెరుగు తున్న ఎండలు, విద్యుత్‌ సమస్యలు, ఇంకా నిండని చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు వానాకాలం పంటలపై దిగులు కలిగి స్తు న్నవి. అత్యధికంగా 32 నుంచి 34 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత లు నమోదవుతున్నా వేడి ప్రభావం మాత్రం 36,38 డిగ్రీల మధ్య ఉంటున్నది.


దీనితో వరి పొలాలకు పెట్టే నీరు కూడా వేడెక్కుతూ మొక్క బొంగు పోయే ప్రమాదమున్నదని రైతులు ఆందో ళన చెందుతున్నారు. రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావం మరింత తీవ్రంగా ఉండబోతుందని శాస్త్రజ్ఞులు చెబుతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా లో 12,05,706 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందు లో ప్రధాన పంటలుగా వరి, పత్తి పంటలు ఉన్నాయి. 10,96,152 ఎకరాల్లో వరి సాగు జరుగగా 1,66,257 ఎకరాల్లో పత్తి వేశారు.


ప్రస్తుతం పత్తి పంట ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొంటుండగా మరి కొద్దిరోజుల్లోనే వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి పంట కూడా దెబ్బతినే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నెర్రలు బారే దశకు వచ్చిన వరి పొలాలను ఐదు రోజుల క్రితం అల్పపీడనం కారణంగా కురిసిన వర్షాలు కాపాడాయి. మళ్లీ ఇప్పుడు అదే వేడి పరిస్థితులు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. జూన్‌ మొదటి నుంచి ఇప్పటి వరకు 110 రోజుల్లో 50 నుంచి 55 రోజులు మాత్రమే వర్షపు దినాలు గా నమోదయ్యాయి.


కరీంనగర్‌ జిల్లాలో 666.4 మిల్లి మీటర్ల వర్షం పడాల్సి ఉండగా 575.3 మి.మీ. వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లాలో 789.1 మి.మీ వర్షానికి 778.6 మి.మీ, వర్షం పడింది. జగిత్యాల జిల్లాలో 792.5 మి.మీకు 711.7 మి.మీ వర్షం కురిసిం ది. రాజన్న సిరిసిల్లలో 651.1 మి.మీకు గాను 666.6 మి.మీ వర్షం కురిసింది. ఎండ వేడిమి పెరుగడంతో విద్యుత్‌ వినియో గం ఎక్కువై కరెంటు సరఫరాలో అంతరాయం కలుగుతున్నది. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయానికి కరెంటు సరఫరా నిలిచి పోతుండడంతో మండలాల్లో రైతులు ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎల్‌నినో ప్రభావం పెద్దగా లేక పోయినా రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పం టలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశమున్నది.


kk.jpgకరీంనగర్‌ జిల్లాలో ఈసారి వానాకాలంలో సాధారణ సాగు విస్తీర్ణంలో 98శాతం వివిధ రకాల పంటలను వేశారు. మొత్తం గా 3,31,417 ఎకరాలకు 3,23,606 ఎకరాల్లో పంటలు సాగ య్యాయి. ఇందులో సింహ భాగం వరి పంటను 2,65,734 ఎకరా ల్లో వేశారు. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి కరీంనగర్‌ జిల్లాలో 13శాతం లోటు వర్ష పాతం నమోదైంది. జిల్లాలో 45,836 ఎకరాల్లో వేసిన పత్తి పంటపై ఎల్‌ నినో ప్రభావం ఉంది.


పెద్దపల్లి జిల్లాలో..

జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి 2,67,810 ఎకరాల్లో సాగు చేశారు. దాదాపు 96శాతం పంటలు వేశారు. 2,79,517 సాధారణ విస్తీర్ణానికి అత్యంత చేరువుగా ఇక్కడ పంటలు సాగు చేశారు. ఇక్కడ కూడా వరి పంటపైన రైతులు ఎక్కువగా మొగ్గు చూపారు. గత ఏడాది 2,10,046 ఎకరాల్లో వరివేయగా ఈసారి 2,15,301 ఎకరాల్లో వరి సాగు చేశారు. వరి పంటకు చివరి తడిలు అందక ఇబ్బంది ఇప్పుడే ఏర్పడుతుంది. కెనాల్‌ కింద నీటి పారకం ఇటీవల తగ్గి పోవడంతో రైతులు ఆందోళన చెందు తున్నారు.


అలాగే గత ఏడాది కంటే పత్తి పంటను కూడా ఎక్కు వగానే సాగు చేశారు. గత ఏడాది 49,783 ఎకరాల్లో పత్తి సాగు చేయగా ఈసారి 51,426 ఎకరాల్లో వేశారు. చీడ పురుగులకు ఫెస్టిసైడ్స్‌ ఎక్కువగా పిచికారి చేస్తుండడం వల్ల రైతులు ఆర్థిక భారాన్ని మోస్తున్నారు. అయితే జిల్లాలో కేవలం 2శాతం లోటు వర్షపాతం ఉంది. ఎక్కువగా బోరు నీటిని పంట లకు వాడుతు న్నారు. ఇలాగే ఎండల తీవ్రత అధికంగా ఉంటే వరి సాగు విస్తీ ర్ణంలో సగం పంట ఎండిపోయే అవకాశముంటుందని కలవర పడుతున్నారు. కొన్ని మండలాల్లో ఇప్పటికే వరి ఎండుతుండగా, పొలాలు బీటలు వారుతున్నాయి. చెరువుల కింద సాగు చేసి న ఆయ కట్టు పంటలకు నీరందటం కష్టంగా మారుతోంది.


zzz.jpgజగిత్యాల జిల్లాలో...

జగిత్యాల జిల్లాలో కూడా ఆశించిన వర్షాలు లేవు. ఇప్పటి వరకు 3,86,583 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో వరి 3,02,860 ఎకరాలు, మొక్కజొన్న 38,910 ఎకరా లు, పత్తి 18,720 ఎకరాల్లో సాగుతుండగా మిగతా ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. కాగా జిల్లాలో 10 మి.మీ. లోటు వర్షపాతం ఉంది. జిల్లాలోని 20 మండలాల్లోని 12 మండలాల్లో సాధారణం, 7 మండలాల్లో లోటు, ఒక మండలంలో అధిక వర్షం కురిసింది. వర్షాలు కురియక పోవడంతో భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టి బోర్లు, బావుల్లో ఆశించిన మేరకు నీరు లేదు.


చెరువులు, కుంటలు సైతం 70శాతం మేరకు నిండాయి. జిల్లాలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కాకతీయ కాలువ, వరద కాలువ కింద సుమారు 2.10 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌ఎస్‌పీలోకి వరద నీరు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఆయకట్టు ప్రాంతాల్లోని రైతు లు సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరి పొలాలు ఎండిపోతున్నాయి. మొక్కజొన్న పంటకు సైతం సాగు నీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


రాజన్న సిరిసిల్ల జిల్లాలో...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం సీజన్‌లో ఎల్‌నినో ప్రభా వం ఉంటుందని ప్రభుత్వం ప్రచారం చేయడంతో 30వేల ఎకరాల వరకు సాగు విస్తీర్ణం తగ్గింది. 2.48 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తారని వ్యవసాయ అంచనా వేయగా 2.16 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ప్రధానంగా వరి 1.46 లక్షల ఎకరాలు, పత్తి 50,275 ఎకరాల్లో సాగు చేశారు. జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇక్కడ ప్రధానంగా బోరు బావులపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తారు. జిల్లాలో 90వేల వ్యవసాయ బోరు బావులు ఉన్నాయి. బోరు బావుల్లో నీళ్లు ఉన్నప్పటికీ కరెంటు కోతలతో పంటలకు నీరు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు త్రీఫేజ్‌ కరెంటు ఇవ్వాల్సి ఉండగా సక్రమంగా నాలుగు గంటలు కూడా రావడం లేదని రైతులు చెబుతున్నారు. రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

300 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అబద్ధం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 19 , 2026 | 12:11 PM