జియో, వీఐ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. నచ్చిన నంబర్‌ను ఇలా పొందండి!
ABN , Publish Date - Sep 19 , 2026 | 11:07 AM
మొబైల్ నంబర్ ఫ్యాన్సీగా ఉండాలని, ఇతరుల కంటే ప్రత్యేకంగా, సులభంగా గుర్తుపట్టేలా ఉండాలని చాలామంది కోరుకుంటారు. వరుస అంకెలు లేదా ఒకే అంకె పలుసార్లు వచ్చే విధంగా ఉండే నంబర్లకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: మొబైల్ నంబర్ ఫ్యాన్సీగా ఉండాలని, ఇతరుల కంటే ప్రత్యేకంగా, సులభంగా గుర్తుపట్టేలా ఉండాలని చాలామంది కోరుకుంటారు. వరుస అంకెలు లేదా ఒకే అంకె పలుసార్లు వచ్చే విధంగా ఉండే నంబర్లకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. ఇలాంటి వీఐపీ లేదా ఫ్యాన్సీ మొబైల్ నంబర్ కోసం ఇప్పుడు టెలికాం సంస్థల అధికారిక వెబ్‌సైట్ల ద్వారా నంబర్లను ఎంచుకునే వెసులుబాటు ఉంది (VIP mobile number).
జియోలో ప్రస్తుతం ప్రిఫర్డ్ నంబర్, మరొకటి మ్యాచింగ్ నంబర్ అనే రెండు రకాల ఎంపికలు ఉన్నాయి. జియో ప్రిఫర్డ్ నంబర్ సేవలో వినియోగదారులు తమకు కావాల్సిన 10 అంకెల నంబర్‌ను నమోదు చేసి, అందుబాటులో ఉంటే, దాన్ని ఎంచుకోవచ్చు. ఈ సేవ ప్రస్తుతం జియోప్లస్ పోస్ట్‌పెయిడ్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక, మ్యాచింగ్ నంబర్ సేవలో, మీ ప్రస్తుత నంబర్‌ను పోలి ఉండే కొత్త నంబర్లను జియో సూచిస్తుంది. ప్రస్తుత నంబర్ జియోది కాకపోయినా, పిన్‌కోడ్ ఆధారంగా అందుబాటులో ఉన్న మ్యాచింగ్ నంబర్లను చూడవచ్చు (Jio choice number).
ఇక, వోడాఫోన్ ఐడియా వినియోగదారులు కూడా తమకు నచ్చిన అంకెల ఆధారంగా ఫ్యాన్సీ నంబర్‌ను ఎంచుకునే అవకాశం ఉంది (Vi fancy number). వీఐ అధికారిక వెబ్‌సైట్‌లో కనీసం మూడు అంకెలను నమోదు చేసి, ఆ అంకెలతో సరిపోలే అందుబాటులో ఉన్న నంబర్లను చూడవచ్చు. ఉదాహరణకు మీకు 786, 999, 2026 వంటి అంకెల కలయిక నచ్చితే, అందుబాటులో ఉన్న నంబర్లలో ఆ నమూనాతో సరిపోయే వాటిని వెతకవచ్చు. వీఐలో అందుబాటులో ఉన్న ఫ్యాన్సీ నంబర్లలో కొన్ని ఉచితంగా, మరికొన్ని ప్రీమియం ధరకు లభిస్తాయి. ప్రీమియం నంబర్‌కు సంబంధించిన అదనపు ధరను ఎంపిక సమయంలో చూపిస్తారు.
ఇవి కూడా చదవండి..
బిల్లుపై సంతకం పెట్టిన ట్రంప్.. భారత్, చైనాపై 100 శాతం సుంకాలకు మార్గం సుగమం..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..