Home » Jio 5g phone
నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 48వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ఛైర్మన్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. భవిష్యత్ వ్యూహాలు, టెక్నాలజీ మార్పులు, వినియోగదారుల ప్రయోజనాలకు సంబంధించి కీలక ప్రసంగం చేశారు.
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో, వరుసగా పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్లను నిలిపివేస్తోంది. తరచూ తన టారిఫ్ లైనప్‌లో మార్పులు చేస్తోంది. ఇటీవల రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌ను రద్దు చేసిన జియో.. ఆ మరుసటి రోజే రూ.799 ప్లాన్‌ను కూడా తొలగించింది.
స్వాతంత్ర్య దినోత్సవ నెలలో బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్‌తో ముందుకొచ్చింది. కేవలం ఒకే ఒక్క రూపాయి ఖర్చుతో నెల రోజులపాటు ప్రతిరోజూ 2 జీబీ హై స్పీడ్ డేటా ప్లాన్ తీసుకొచ్చింది.
దీపావళి సందర్భంగా రిలయన్స్ జియో (Jio) బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో భారత్ దీపావళి ధమాకా ఆఫర్ పేరుతో జియో భారత్ 4జీ ఫోన్ల (JioBharat 4G) ధరను తగ్గించింది.
ప్రైవేట్ కంపెనీలు పెంచిన రీఛార్జ్ ధరలు తట్టుకోలేక లక్షలాది మంది ఇప్పటికే బీఎస్ఎన్ఎల్‌కు మారిపోయారు. మరోవైపు దేశంలోని అనేక నగరాల్లో బీఎస్ఎన్‌ఎల్ ఇప్పటికే.. తన 4G నెట్‌వర్క్ ప్రారంభించింది. తాజాగా 5G నెట్‌వర్క్ సేవలను సైతం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. అందులోభాగంగా సంస్థ తన సేవలను మెరుగు పరచడం కోసం వేలాది కొత్త సెల్ టవర్లను ఏర్పాటు చేసింది.
జియో(Jio) సంస్థ అక్టోబర్ 11న మరో కొత్త యాప్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే జియో సంస్థ అనేక రకాల యాప్‌లు అందిస్తోంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్‌లతోపాటు తాజాగా జియో ఫైనాన్స్ యాప్(Jio Finance App)ను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది.
దేశంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌లకు అనేక మంది యూజర్లు షాకిచ్చారు. జులై నుంచి పెంచిన రేట్లు అమలైన నేపథ్యంలో లక్షలాది మంది వినియోగదారులు ఈ నెట్‌వర్క్‌ల నుంచి బీఎస్ఎన్ఎల్‌కు మారారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ ఏజీఎం సమావేశంలో భాగంగా జియో(jio) కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో PhoneCall AI సేవ కాల్‌లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫీచర్ ద్వారా మీరు కాల్ చేయకుండానే సందేశాలను పంపవచ్చు. కాల్ సంభాషణను మెసేజ్ రూపంలో స్వీకరించవచ్చు. అయితే ఈ సేవను ఎలా ఉపయోగించాలో ఇక్కడ చుద్దాం.
ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోటీ పడలేక చితికిల పడిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మళ్లీ దూసుకువస్తోంది. 4జీ, 5జీ కనెక్టివిటీతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. గత నెలలో జియో, ఎయిర్‌టెల్, వీఐ మొదలైన టెలికాం ఆపరేటర్లు విపరీతంగా ఛార్జీలను పెంచాయి.
దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన రిలయన్స్ జియో(Reliance Jio) ఇటీవల రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచింది. ధరలు పెంచినప్పటికీ జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను యథావిధిగా అందిస్తూనే ఉంది.