Share News

Reliance AGM 2025 Mukesh Ambani: జియో ఐపీఓ సహా కొత్త యుగానికి రోడ్‌మ్యాప్.. ముఖేష్ అంబానీ కీలక ప్రకటన

ABN , Publish Date - Aug 29 , 2025 | 03:05 PM

నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 48వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ఛైర్మన్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. భవిష్యత్‌ వ్యూహాలు, టెక్నాలజీ మార్పులు, వినియోగదారుల ప్రయోజనాలకు సంబంధించి కీలక ప్రసంగం చేశారు.

Reliance AGM 2025 Mukesh Ambani: జియో ఐపీఓ సహా కొత్త యుగానికి రోడ్‌మ్యాప్.. ముఖేష్ అంబానీ కీలక ప్రకటన
Reliance AGM 2025 Mukesh Ambani:

బిజినెస్ న్యూస్: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) తన 48వ వార్షిక సర్వసభ్య సమావేశం(AGM)ను ఘనంగా నిర్వహించింది. ఈ సమావేశంలో ఛైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani ), జియో ప్లాట్‌ఫారమ్స్ అధ్యక్షుడు ఆకాష్ అంబానీ చేసిన ప్రకటనలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ సమావేశం గణేష్ చతుర్థి సందర్భంగా జరిగింది. ఈ నేపథ్యంలో వాటాదారులకు ముఖేష్ అంబానీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో జియో భవిష్యత్తు రోడ్‌మ్యాప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంటిగ్రేషన్, ఆర్థిక ఫలితాల గురించి ప్రకటించారు.


కస్టమర్ కేంద్రీకృత విధానం

ఆకాష్ అంబానీ తన ప్రసంగంలో కస్టమర్ సేవల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మా కస్టమర్ సేవలు ఒక విభాగం కాదని, అది ఒక వాగ్దానమని ఆయన అన్నారు. జియో కస్టమర్ అనుభవాన్ని మరింత ఆహ్లాదకరంగా, సంతృప్తికరంగా మార్చేందుకు ప్రతి టచ్‌పాయింట్‌ను పునఃరూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఈవెంట్-ఆధారిత వ్యవస్థలు, API ప్రారంభిత టెక్నాలజీ, జనరేటివ్ AI ద్వారా కస్టమర్ సమస్యలను త్వరగా పరిష్కరించడంతోపాటు, కచ్చితమైన సేవలను అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.


జియో భవిష్యత్తు రోడ్‌మ్యాప్

  • జియో భవిష్యత్తు లక్ష్యాలు దేశవ్యాప్తంగా కనెక్టివిటీని మెరుగుపరచడంపై దృష్టి సారించాయి. వాటిలో

  • ప్రతి భారతీయుడిని కనెక్ట్ చేయడం: మొబైల్, హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల ద్వారా అందరికీ కనెక్టివిటీని అందించడం

  • స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్: జియో స్మార్ట్ హోమ్, జియోటీవీ+, జియో టీవీ ఓఎస్, ఆటోమేషన్‌తో ప్రతి ఇంటిని డిజిటలైజ్ చేయడం

  • వ్యాపారాల డిజిటలీకరణ: సులభమైన, స్కేలబుల్, సురక్షితమైన ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వ్యాపారాలను డిజిటల్‌గా మార్చడం

  • AI విప్లవం: AI Everywhere for Everyone దృష్టితో AI సాంకేతికతలో నాయకత్వం వహించడం

  • గ్లోబల్ విస్తరణ: భారతదేశం వెలుపల జియో స్వదేశీ సాంకేతికతను ప్రపంచానికి తీసుకెళ్లడం


జియో IPO ప్రకటన

ఈ క్రమంలో 2026 మొదటి ఆరు నెలల్లో జియో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) కోసం దరఖాస్తు చేస్తామని ముఖేష్ అంబానీ తెలిపారు. జియో గత 10 సంవత్సరాలలో 50 కోట్ల మంది కస్టమర్లను చేరుకుందని, ఇది దేశ ప్రజల వల్ల చేకూరిన ఘనత అని పేర్కొన్నారు.

మన యుగంలో కామధేను

ముఖేష్ అంబానీ తన ప్రసంగంలో AIని మన యుగంలోని కామధేనుగా అభివర్ణించారు. రిలయన్స్ ఇంధనం, రిటైల్, టెలికాం, వినోద రంగాలలో AIని ఇంటిగ్రేట్ చేస్తున్నట్లు చెప్పారు. క్లీన్ ఎనర్జీ, జెనోమిక్స్, AIలో జరుగుతున్న మార్పులు భవిష్యత్తులో వృద్ధిని నడిపిస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 29 , 2025 | 03:31 PM