సింగరేణిలో ‘గుర్తింపు’ గుబులు
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:37 PM
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల గుబు లు మొదలైంది. ప్రతి ఎన్నికల సందర్భంలో కార్మిక సంఘాల పదవీకాలం అంశం వివాదాస్పదంగానే మారుతోంది.
షెడ్యూల్ ప్రకారం మూడు మాసాలే గడువు
దృష్టిసారించిన రాజకీయ పార్టీలు
గోదావరిఖని(కరీంనగర్): సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల గుబు లు మొదలైంది. ప్రతి ఎన్నికల సందర్భంలో కార్మిక సంఘాల పదవీకాలం అంశం వివాదాస్పదంగానే మారుతోంది. సింగరేణిలో ఎన్నికలు నిర్వహించే లేబ ర్ కమిషనర్ అధికారులు ఎన్నికల కాల పరిమితి రెండు సంవత్సరాలుగా ప్రకటించి ఎన్నికలు నిర్వహించారు. కానీ మరోసారి ఎన్నికలు జరిగేసరికి నాలుగు సంవత్సరాలు, ఆరు సంవత్సరాల వరకు గెలిచిన సంఘం గుర్తింపు సంఘంగానే ఉంటుంది. ఎన్నిక లు జరిగిన రెండేళ్ల తరువాతసింగరేణిలో ప్రతిపక్ష కార్మిక సంఘాలు ఎన్నికలు నిర్వహించాలని డిమాం డ్ చేస్తాయి. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది.
రెండేళ్ల కాలపరిమితితో
2023 డిసెంబర్‌లో రెండేళ్ల కాలపరిమితితో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ గుర్తింపు కార్మిక సంఘంగా విజయం సాధించింది. దీని ప్రకారం 2025 డిసెంబరులోనే సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగాల్సి ఉంది.
కానీ 2023 ఎన్ని కల ఫలితాల వెల్లడి తరువాత తొమ్మిది మాసాలకు 2024 సెప్టెంబర్‌లో ఏఐటీ యూసీకి అధికారికంగా లేబర్ కమిషనర్ గుర్తింపు సం ఘంగా పత్రం ఇచ్చిం ది. ఏఐటీయూసీ తమను గుర్తింపు సంఘం గా గుర్తించింది సెప్టెంబరు 2024 అయినందున ఈ యేడాది సెప్టెంబరు వరకు గుర్తింపు సంఘంగా ఉండాలనేది వాదన. దీంతో పాటు గతంలో టీబీజీకేఎస్ రెండుసార్లు విజయం సాధించి ఒకసారి నాలుగేళ్లు, మరో సారి ఆరేళ్లు గుర్తింపు సంఘంగా కొనసాగిందని, తాము 2028 సెప్టెంబరు వరకు గుర్తింపు సంఘంగా కొనసాగుతామని ఏఐటీయూసీ పేర్కొంటోంది. 2023 డిసెంబర్ ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ ఆరు ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘంగా గెలిచింది. ఐదు ఏరియాల్లో ఏఐటీయూసీ ప్రాతినిధ్య సంఘంగా నిలుబడడంతో పాటు సింగరేణి వ్యాప్తంగా ఏఐటీయూసీ ఎక్కువ ఓట్లు సాధించింది.
ఆరు ఏరియాల్లో తాము విజయం సాధించాము కనుక తమకే గుర్తింపు ఇవ్వాలని ఐఎన్‌టీయూసీ లేబర్ కమిషన్‌తో పాటు అటు సింగరేణి యాజ మాన్యంపై ఒత్తిడి తెచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఐఎన్‌టీయూసీ వాదనను యాజమాన్యం కాదన లేని పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదంలో గుర్తింపు పత్రం ఏఐటీయూసీకి దక్కడానికి తొమ్మిది మాసాల ఆలస్యం జరిగింది. ఈయేడు సెప్టెంబరుతో ముగియనుండడంతో సింగరేణిలో ఎన్నికలు జరుగుతాయనే చర్చ మొదలైంది. షెడ్యూల్ ప్రకారం మరో మూడు మాసాల్లో ఎన్నికలు జరుగాల్సి ఉంది.
గుర్తింపు ఎన్నికలకు రాజకీయ ప్రాధాన్యం
సింగరేణిపై రాజకీయ పార్టీల దృష్టి కేంద్రీకృతమైంది. ప్రతి రాజకీయ పార్టీకి సింగరేణిలో అనుబంధ కార్మిక సంఘం ఉండడంతో గుర్తింపు సంఘం ఎన్నికలకు ప్రాధాన్యం సంతరించుకున్నది. సరాసరిగా 11 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పరోక్షంగా ఉత్తర తెలంగాణలోని సుమారు 25 నుంచి 30 అసెంబ్లీ సెగ్మెంట్లను ప్రభావితం చేసే కోల్‌బెల్ట్ ప్రాంత ప్రజల మనోభావాలను సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ద్వారా వెల్లడవుతాయి. ఈ నేపథ్యంలో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకమయ్యాయి. 40వేల కార్మికులు గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉండడంతో ఈ ఎన్ని కలను మినీ అసెంబ్లీ ఎన్నికలుగా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అయితే సింగరేణిలో షెడ్యూల్ ప్రకారం మరో మూడు నాలుగు మాసాల్లో ఎన్నికలు నిర్వహిస్తారా, వాయిదా వేస్తూ సాగదీస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
సింగరేణి ఎన్నికల విషయంలో ఎన్నికల నిర్వహణకు లేబర్ కమిషనర్ ముందుకు వచ్చినప్పటికీ సింగరేణి యాజమాన్యం ఎన్ని కల నిర్వహణకు సంసిద్ధతను ప్రకటించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల నిర్వహణలో ప్రభు త్వ విభాగాల సిబ్బంది పాల్గొనాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహణపై సానుకూలత వ్యక్తం చేయాల్సి అవసరం ఉంది. ఇప్పుడు సింగరేణిలో నెలకొన్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అటు ప్రభుత్వం, ఇటు యాజమాన్యం సాను కూలంగా స్పందించే పరిస్థితి లేదు. బొగ్గు మాయం అంశం, సోలార్ టెండర్లలో ఆరోప ణలు, నైనీ, ఓబీ బొగ్గు బ్లాకుల టెండర్ల కుంభకోణం అంశాలపై సింగరేణిలో రాజకీయ వేడి నెలకొంది.
ఇలాంటి పరిస్థితుల్లో షెడ్యూ ల్ ప్రకారం సింగరేణిలో ఎన్నికల్లో జరుగుతాయో లేదోనని కార్మికులు చర్చించుకుం టున్నారు. అయితే ఇప్పటికే పలు కార్మిక సంఘాలు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వ హించాలని డిమాండ్ చేస్తున్నాయి. కోల్‌బెల్ట్ ప్రాంతమంతా కాంగ్రెస్ శాసనసభ్యులు ఉండడం కారణంగా ఐఎన్‌టీయూసీ సైతం ఎన్ని కలు జరిగితే బాగుండుననే సంకేతాలు ఇస్తున్నది. గత ఎన్నికల్లో ఆరు డివిజన్లలో గెలిచి ఏఐటీయూసీకి గట్టి పోటీ ఇచ్చిన ఐఎన్‌టీ యూసీ ఎన్నికలు వస్తే తమదే విజయమని భావిస్తున్నది.
ప్రభుత్వ వ్యతిరేకత, కుంభకో ణాల ఆరోపణల నేపథ్యంలో తమకు ప్రయో జనం జరుగుతుందనే ఆలోచనలో ఇటు బీఆర్‌ఎస్, టీబీజీకేఎస్ దూకుడును ప్రదర్శిస్తు న్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేసిన సీపీఐ, కాంగ్రెస్ సింగరేణి ఎన్నికల్లో మాత్రం అనుబంధ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలను పోటీలో దింపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గుర్తింపు సంఘం ఎన్నికలు కార్మిక సంఘాల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
ఢిల్లీలో రేవంత్ బిజీబిజీ.. కిషన్‌రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి ఖట్టర్‌తో సమావేశం
మహబూబాబాద్ జిల్లాలో మొసలి కలకలం..
Read Latest AP News And Telangana News And International News And Telugu News