Share News

'నీట్‌' రాష్ట్రంలో అసమానతల్ని సృష్టిస్తోంది: సీఎం విజయ్

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:47 AM

నీట్ విధానం రాష్ట్రంలో అసమానతల్ని సృష్టిస్తోందని తమిళనాడు సీఎం విజయ్ అన్నారు. దీనిని వెంటనే రద్దుచేయాలని ఆయన డిమాండ్ చేశారు.

'నీట్‌' రాష్ట్రంలో అసమానతల్ని సృష్టిస్తోంది: సీఎం విజయ్
CM Vijay opposes NEET

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు విద్యార్థుల్లో నీట్‌(NEET) అసమానతల్ని సృష్టిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సీ.జోసెఫ్ విజయ్ అన్నారు. అసమానతలకు కారణమైన నీట్‌‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందీ భాషనూ వ్యతిరేకించారు. తమిళం, ఇంగ్లీష్‌లతో కూడిన ద్విభాషా విధానానికే తాము కట్టుబడి ఉంటామన్నారు.


నీట్ వల్ల సామాజిక అసమానతలు పెరుగుతున్నాయని సీఎం విజయ్ చెప్పుకొచ్చారు. విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడి తెస్తున్న ఈ పరీక్షను రద్దుచేసి, ఇంటర్‌ మార్కుల ఆధారంగా వైద్య సీట్లను కేటాయించాలని తమిళనాడు చాలా కాలంగా కోరుతోందని ఆయన గుర్తుచేశారు. హిందీ భాషపైనా స్పందిస్తూ.. తమిళం రాష్ట్ర భాషగా, ఇంగ్లీష్‌ అంతర్జాతీయ భాషగా సరిపోతాయని తన వైఖరిని స్పష్టం చేశారు విజయ్. మూడో భాషను బలవంతంగా రుద్దాల్సిన అవసరంలేదని, రెండు భాషల విధానమే కొనసాగుతుందని తేల్చి చెప్పారు.


విమర్శలపై..

తమ పార్టీని విమర్శించే వారికి ఈ సందర్భంగా గట్టిగా సమాధానమిచ్చారు సీఎం విజయ్. ప్రజల మద్దతుతోనే తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధికారంలోకి వచ్చిందన్న ఆయన.. దీని వెనుక ఎన్నో కుట్రలు, సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు. 'జనం గుండెల్లో స్థానం సంపాదించడం అంత సులువు కాదు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే ఇక్కడకు వచ్చాం. అయినప్పటికీ కొందరు 'నటుడి పార్టీ' అనే విమర్శలు గుప్పిస్తున్నారు. వాటన్నింటినీ మేం పట్టించుకోం. మా రాజకీయాలు పారదర్శకంగా ఉంటాయ్' అని విజయ్ చెప్పుకొచ్చారు. అలాగే కుటుంబ రాజకీయాలపై ఆయన మాట్లాడుతూ.. 'మా రాజకీయాలు ఒక్క కుటుంబం కోసమే కాదు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం మాదే. అదే మా పాలన.. అదే మా లక్ష్యం' అని స్పష్టం చేశారు.


ఇవీ చదవండి:

కేంద్ర మంత్రి కురియన్ రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం

ఒప్పందం ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: డొనాల్డ్ ట్రంప్

Updated Date - Jun 23 , 2026 | 11:55 AM