రిజిస్ట్రేషన్లలో అక్రమాలపై విజిలెన్స్ ఫోకస్.. భూముల డాక్యుమెంట్లను తనిఖీ చేస్తున్న అధికారులు
ABN , Publish Date - Nov 17 , 2026 | 01:43 PM
వనస్థలిపురం మునగనూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అధికారులు ఆరా తీశారు.
హైదరాబాద్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): వనస్థలిపురం మునగనూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు ఈరోజు (మంగళవారం) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అధికారులు ఆరా తీశారు. భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు పరిశీలించారు. ప్రభుత్వ రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలను తనిఖీ చేశారు.
ఈ కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రిజిస్ట్రేషన్లలో ఏమైనా అవకతవకలు జరిగాయా అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సోదాల్లో ఏయే అంశాలు వెలుగులోకి వచ్చాయనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. విజిలెన్స్ అధికారుల తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇళ్ల పథకం లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ ఊరట
ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి తుమ్మల
భారత్ సమ్మిట్ వివాదం.. డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన బీజేపీ నేతలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News