తెలంగాణకు రాయబారులుగా మారండి
ABN , Publish Date - Nov 15 , 2026 | 04:42 AM
తెలంగాణలోని అభివృద్ధి, ఆవిష్కరణలు, భాగస్వామ్య అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని సమ్మిట్‌లో పాల్గొన్న అంతర్జాతీయ ప్రతినిధులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు.
భారత్ సమ్మిట్ ప్రతినిధులకు మంత్రి ఉత్తమ్ పిలుపు
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని అభివృద్ధి, ఆవిష్కరణలు, భాగస్వామ్య అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని సమ్మిట్‌లో పాల్గొన్న అంతర్జాతీయ ప్రతినిధులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. సమ్మిట్‌లో పాల్గొన్న ప్రతినిధులంతా తమ దేశాలకు తిరిగివెళ్లిన తర్వాత తెలంగాణకు రాయబారులుగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. భారత్ సమ్మిట్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అవకాశాలను ఇతరులకు వివరించి, పెట్టుబడులు, దీర్ఘకాలిక అంతర్జాతీయ భాగస్వామ్యాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు.
విభిన్న అనుభవాలు, అభిప్రాయాలు, దృక్పథాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రజాస్వామ్యం, న్యాయం, పరస్పర సహకారంపై గంభీరమైన చర్చలకు భారత్ సమ్మిట్ అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచంలో భారతదేశ స్థానం, కృత్రిమ మేధ, న్యాయమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆవశ్యకత, యువత భవిష్యత్తు రాజకీయాలు, వాతావరణ మార్పులు, లింగ సమానత్వం వంటి కీలక అంశాలపై సదస్సులో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. ‘ఫార్జింగ్ ఏ న్యూ వరల్డ్’ అనే ఇతివృత్తం ద్వారా ప్రపంచంలో చోటుచేసుకుంటున్న మార్పులను అర్థం చేసుకోవడంతో పాటు, వాటికి అనుగుణంగా భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన అవసరంపై చర్చించామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి
అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా
ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News