హైదరాబాద్‌లో ఇద్దరి మహిళల దారుణ హత్య
ABN , Publish Date - Nov 04 , 2026 | 07:03 PM
హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో ఇద్దరు మహిళలను ఓ వ్యక్తి అత్యంత దారుణంగా చంపేశాడు. ఈ డబుల్ మర్డర్స్ స్థానికంగా కలకలం సృష్టించాయి. కుటుంబ కలహాల కారణంగానే కుటుంబంలోని ఇద్దరు మహిళలపై అల్లుడు సిద్ధిక్ కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశాడు.
హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో ఇద్దరు మహిళలను ఓ వ్యక్తి అత్యంత దారుణంగా చంపేశాడు. ఈ డబుల్ మర్డర్స్ స్థానికంగా కలకలం సృష్టించాయి. కుటుంబ కలహాల కారణంగానే కుటుంబంలోని ఇద్దరు మహిళలపై అల్లుడు సిద్ధిక్ కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశాడు. మృతిచెందిన వారిలో బి. నిరంజన్ (అత్త), యూసుఫ్ బావమరిది భార్య రేష్మ ఉన్నారు. సిద్ధిక్‌తో తమకు ప్రాణహాని ఉందని తమకు రక్షణ కల్పించాలని ఈరోజు (బుధవారం) ఉదయం మీర్‌పేట్ పోలీసులను బాధిత కుటుంబం ఆశ్రయించిన విషయం తెలిసిందే.
తమ ఫ్యామిలీకి రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని బాధితులు ఆరోపిస్తున్నారు. మహిళలను చంపేసిన అనంతరం సిద్ధిక్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యలకు గల కారణాలపై పోలీసులు ఆరా స్తున్నారు. సిద్ధిక్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్ హయాంలో తెలంగాణ సొత్తును కొల్లగొట్టారు.. మంత్రి పొంగులేటి ధ్వజం
సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్
బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News