Hot Air Balloons Incident: హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్ షోలో అపశృతి
ABN , Publish Date - Jan 17 , 2026 | 01:18 PM
హైదరాబాద్ నగర శివారులో నిర్వహిస్తున్న హాట్ ఎయిర్ బెలూన్ షోలో అపశృతి చోటుచేసుకుంది. సాంకేతిక సమస్య కారణంగా రెండు హాట్ ఎయిర్ బెలూన్‌లు ఇబ్రహీంబాద్ చెరువు – మంచిర్యాల దేవాలయం సమీపంలో అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది.
హైదరాబాద్, జనవరి17 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగర శివారులో నిర్వహిస్తున్న హాట్ ఎయిర్ బెలూన్ షో(Hot Air Balloons Incident)లో అపశృతి చోటుచేసుకుంది. సాంకేతిక సమస్య కారణంగా రెండు హాట్ ఎయిర్ బెలూన్‌లు ఇబ్రహీంబాద్ చెరువు – మంచిర్యాల దేవాలయం సమీపంలో అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. అయితే.. బెలూన్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బెలూన్‌లో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

ఘటనకు కారణమిదే..
ఈ ఘటన శుక్రవారం.. గోల్కొండ నుంచి గండిపేట్ వైపు ప్రయాణిస్తున్న సమయంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. హాట్ ఎయిర్ బెలూన్‌లో అవసరమైన స్థాయిలో గాలి లేకపోవడంతో, నియంత్రణ కోల్పోయే పరిస్థితి తలెత్తింది. దీంతో పైలట్ వెంటనే పరిస్థితిని అంచనావేసి చెరువు పక్కన అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు బెలూన్ విషయాన్ని గమనించి అధికారులకు సమాచారమిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే నిర్వాహకులు, సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

తప్పిన ప్రాణాపాయం..
హాట్ ఎయిర్ బెలూన్ సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించడంతో బెలూన్ సురక్షితంగా దిగింది. ప్రయాణికులను ఒక్కొక్కరుగా బయటకు తీసుకురావడంతో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్ షోలో జరిగిన ఈ అపశృతి క్షణకాలం ఉత్కంఠకు గురిచేసినా.. సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఇబ్రహీంబాద్ చెరువు సమీపంలో ల్యాండ్ అయిన రెండు బెలూన్లలో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి...
ఆ నలుగురు సీఎంలపై మంత్రి తుమ్మల ఇంట్రస్టింగ్ కామెంట్స్..
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు బ్రేక్
Read Latest Telangana News And Telugu News