Share News

రాహుల్‌ పక్కన పరుగెత్తడం నా అదృష్టం

ABN , Publish Date - Nov 15 , 2026 | 06:12 AM

గిగ్‌ వర్కర్ల ర్యాలీలో అగ్రనేత రాహుల్‌ గాంధీ పక్కన పరుగెత్తడం తన అదృష్టమని, అధినాయకుడి పక్కన నడిచే అవకాశం రావడం మహాభాగ్యమని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు.

రాహుల్‌ పక్కన పరుగెత్తడం నా అదృష్టం
Mahesh Kumar Goud and Rahul Gandhi

  • టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

హైదరాబాద్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): గిగ్‌ వర్కర్ల ర్యాలీలో అగ్రనేత రాహుల్‌ గాంధీ పక్కన పరుగెత్తడం తన అదృష్టమని, అధినాయకుడి పక్కన నడిచే అవకాశం రావడం మహాభాగ్యమని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. శనివారం ఆయన మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ర్యాలీ సమయంలో ఓ బైక్‌ స్కిడ్‌ కావడంతో తాను వెనక్కి వెళ్లాల్సి వచ్చిందని, తాను పక్కన లేకపోవడాన్ని గమనించిన రాహుల్‌ గాంధీ స్వయంగా పిలిచారని తెలిపారు.


తాను ఫిట్‌గా ఉండబట్టే ఆయన వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లగలిగానని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ వివరించారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై రాహుల్‌గాందీ ప్రశంసలు కురిపించారని చెప్పారు. సమ్మిట్‌లో భాగంగా విదేశీ, భారతీయ ప్రతినిధులకు సోనియా గాంధీ జీవిత చరిత్ర పుస్తకాలను పంపిణీ చేశామని తెలిపారు. రాహుల్‌గాంఽధీకి తాను ఒక ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశానని.. రోజూ కుర్తా పైజామా ధరిస్తే చాలా బాగుంటుందని సూచించగా ఆయన నవ్వుతూ తనకు చాక్లెట్‌ ఇచ్చారని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి

అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా

ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 06:12 AM