Share News

ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి జరుపుకోండి!

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:10 AM

దీపావళి పండుగను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి జరుపుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నేతలకు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సూచించారు.

ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి జరుపుకోండి!
Mahesh Kumar Goud

  • పార్టీ నేతలకు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ సూచన

హైదరాబాద్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): దీపావళి పండుగను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి జరుపుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నేతలకు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సూచించారు. ఇందిరమ్మ పేరుతో గతంలో ఎన్నడూ లేని విధంగా పేదలకు కొత్త ఇళ్లను ప్రభుత్వం ఇచ్చిందని, ఇది వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చే సందర్భమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పేదల కల నెరవేరిన నేపథ్యంలో వారితో దీపావళి పండుగను జరుపుకుని వారి ఆనందంలో భాగస్వాములు కావాలనిసూచించారు. గ్రామాల్లో రెండు దఫాలుగా ఇళ్లు మంజూరు చేశామని, హైదరాబాద్‌లో లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.


దామోదర, లక్ష్మీకాంతరావులతో భేటీ వాయిదా..

ఢిల్లీ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కిన మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావులతో గాంధీభవన్‌లో మహేశ్‌గౌడ్‌తో జరగాల్సిన భేటీ వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల గాంధీభవన్‌కు తాము రాలేకపోతున్నట్లుగా దామోదర, లక్ష్మీకాంతరావు సమాచారం ఇవ్వడంతో ఈ భేటీని వాయిదా వేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై అసెంబ్లీ!

మరో రెండు పథకాలు

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 06:10 AM