Share News

శబరిమలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ABN , Publish Date - Nov 05 , 2026 | 04:09 AM

శబరిమల అయ్యప్ప స్వామి భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ ఆర్టీసీ) ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది.

శబరిమలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
Sabarimala

శబరిమల అయ్యప్ప స్వామి భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ ఆర్టీసీ) ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది. మండల పూజ, మకర విళక్కు సీజన్లను దృష్టిలో ఉంచుకుని భక్తులు సౌకర్యవంతంగా శబరిమలకు చేరుకునేలా ఈ ప్రత్యేక బస్సుల్ని నడుపుతుంది. నవంబరు 16 నుంచి డిసెంబరు 27 వరకు మండల పూజ సీజన్‌లో, డిసెంబరు 30 నుంచి జనవరి 20 వరకు మకర విళక్కు సీజన్‌లో ప్రత్యేక బస్సులు నడపనున్నారు. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ www.tgsrtcbus.in ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి..

సదర్‌ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక

యూనిఫారాలపై విద్యార్థులు ఏమంటున్నారు?

నేడు క్యాబినెట్‌ భేటీ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 04:09 AM