Share News

తెలంగాణ వ్యాప్తంగా స్వీట్ షాపుల్లో టీజీ సేఫ్ తనిఖీలు

ABN , Publish Date - Oct 25 , 2026 | 01:35 PM

తెలంగాణ వ్యాప్తంగా టీజీ సేఫ్ పలు స్వీట్ షాపుల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘించిన షాపులకు షోకాజు నోటీసులు జారీ చేసింది.

తెలంగాణ వ్యాప్తంగా స్వీట్ షాపుల్లో టీజీ సేఫ్ తనిఖీలు
tg safe inspections

హైదరాబాద్, అక్టోబర్ 25: రాష్ట్రవ్యాప్తంగా టీజీ సేఫ్(తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్) పలు స్వీట్ షాపులు, స్వీట్ల తయారీ యూనిట్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. ఈ మేరకు నిబంధనలు పాటించని షాపులకు నోటీసులు జారీ చేసింది.


టీజీ సేఫ్ అధికారుల కథనం ప్రకారం.. కల్తీ స్వీట్లను విచ్చలవిడిగా తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు టీజీ సేఫ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు స్వీట్ షాపులు, స్వీట్ తయారీ కేంద్రాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. ఈ మేరకు కల్తీ ఆహారపదార్థాలను తయారు చేస్తున్నారన్న అనుమానంతో పలు షాఫుల నుంచి 38 ఆహార పదార్థాల నమూనాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించిన 20 సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేయడంతో పాటు, పలు స్వీట్ షాపులకు షోకాజు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఐపీఎస్‌ల సంతకాలు ఫోర్జరీ చేసి.. కోటికి పైగా కొల్లగొట్టి.. జల్సాలకు తగలెట్టి!

హుడా హైట్స్‌లో చ.గజం అప్‌సెట్‌ ధర 2 లక్షలు

రైతుపై గజ్వేల్‌ ఎస్సై దాడి ?

Read Latest AP News And Telangana News

Updated Date - Oct 25 , 2026 | 01:48 PM