Share News

మత్తు మందుల అక్రమ విక్రయాలపై టీజీ సేఫ్ కొరడా.. 90 మెడికల్ షాపులకు నోటీసులు

ABN , Publish Date - Nov 19 , 2026 | 09:14 PM

మెడికల్ షాపుల్లో మత్తు కలిగించే మందుల విక్రయిస్తున్నారనే ఆరోపణపై టీజీ సేఫ్‌ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తనిఖీలు చేపట్టారు. నిబంధనలను ఉల్లంఘించిన 90 మెడికల్ షాపులకు షోకాజు నోటీసులు జారీ చేసింది.

మత్తు మందుల అక్రమ విక్రయాలపై టీజీ సేఫ్ కొరడా.. 90 మెడికల్ షాపులకు నోటీసులు
tg safe medical shop raids

హైదరాబాద్, నవంబర్ 19: మెడికల్ షాపుల్లో మత్తు కలిగించే మందుల విక్రయిస్తున్నారనే ఆరోపణపై టీజీ సేఫ్‌ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తనిఖీలు చేపట్టారు. నిబంధనలను ఉల్లంఘించిన 90 మెడికల్ షాపులకు షోకాజు నోటీసులు జారీ చేయగా.. తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన మెడికల్ షాపుల లైసెన్సులు రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేసింది.


తెలంగాణలోని మెడికల్ షాపుల్లో నిషేధిత, మత్తు కలిగించే మందులు, యాంటీ బయాటిక్స్‌ను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో టీజీ సేఫ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని కోఠి, అబిడ్స్, బషీర్‌బాగ్, నాంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట సహా పలు ప్రాంతాల్లోని మెడికల్ షాపులలో తనిఖీలు చేశారు.

సనత్‌నగర్, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, మధురానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోనూ అధికారుల సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలలో టీజీ సేఫ్‌తో పాటు.. ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. ట్రామడాల్, ఆల్ప్రజోలం, నైట్రాజెపామ్, కోడైన్ దగ్గు మందుల అక్రమ విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ టీజీ సేఫ్ తనిఖీలు చేపట్టింది.


ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..

జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్‌.. కొట్టివేసిన సుప్రీంకోర్టు

Updated Date - Nov 19 , 2026 | 09:14 PM