Share News

తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. సుమలత కార్యవర్గం రద్దు

ABN , Publish Date - Sep 23 , 2026 | 04:12 PM

తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ పరిధిలోని డ్యాన్సర్స్ అసోసియేషన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత ఆధ్వర్యంలోని కార్యవర్గాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ రద్దు చేసింది.

తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. సుమలత కార్యవర్గం రద్దు
Telugu Film Federation dissolves Sumalatha led dancers association

ఇంటర్నెట్ డెస్క్: తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ పరిధిలోని డ్యాన్సర్స్ అసోసియేషన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత ఆధ్వర్యంలోని కార్యవర్గాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ రద్దు చేసింది. ఈ మేరకు నేడు(బుధవారం) నిర్వహించిన సమావేశంలో డ్యాన్సర్ల అభిప్రాయాలను తీసుకున్నట్లు వెల్లడించింది.


ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి మొత్తం 225 మంది డ్యాన్సర్లు హాజరయ్యారు. సుమలత, రఘు మాస్టర్‌తో పాటు పలువురు సభ్యులూ ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాలకు డాన్సర్ల మద్దతుపై అభిప్రాయాలను సేకరించగా.. సుమలతకు 11 మంది మద్దతు లభించింది. రఘు మాస్టర్‌కు మాత్రం 214 మంది మద్దతు తెలిపారు. దీంతో సుమలత ఆధ్వర్యంలోని ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేస్తు్న్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. డాన్సర్స్ అసోసియేషన్‌కు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు అక్టోబర్ 11న ఎన్నికలు నిర్వహించాలని అధికారికంగా నిర్ణయించింది. ఈ ఎన్నికల ద్వారా నూతన కార్యవర్గం ఏర్పాటుకానుంది.


ఇవీ చదవండి:

హానికర ఉత్పత్తుల ప్రచారంపై రాష్ట్రపతి ముర్ము కీలక వ్యాఖ్యలు

గాజాలో మళ్లీ మోగిన బడి గంట.. విద్యార్థుల ముఖాల్లో ఆనందం!

Updated Date - Sep 23 , 2026 | 04:31 PM