రాష్ట్రంలో మొదలైన చలి పులి
ABN , Publish Date - Nov 07 , 2026 | 06:03 AM
రాష్ట్రంలో చలి తీవ్రత ప్రారంభమైంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా మరింతగా పడిపోతున్నాయి.
కోహిర్‌లో 16.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు
వారం రోజుల్లో 13 డిగ్రీలకు పడిపోయే అవకాశం
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో చలి తీవ్రత ప్రారంభమైంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా మరింతగా పడిపోతున్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో రాత్రి పూట సగటు ఉష్ణోగ్రతలు 16.9 నుంచి 22 డిగ్రీల మధ్య నమోదు అయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం రాత్రి సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 16.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20లోపు నమోదు అయ్యాయి. కాగా వారం రోజుల్లోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 13 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News