నేడు 16 జిల్లాల్లో వర్షాలు
ABN , Publish Date - Nov 06 , 2026 | 05:02 AM
రాష్ట్రంలో శుక్రవారం అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శుక్రవారం అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వెల్లడించింది. రాష్ట్రంలోని జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ-గద్వాల్, నారాయణపేట్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ బ్రాండ్ ప్రపంచానికి చాటాలి
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News