Share News

హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు ఇకపై అద్దె భవనాల్లో ఉండకూడదు: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Nov 11 , 2026 | 06:43 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష అనంతరం.. సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా విద్యారంగంలో సంస్కరణలు చేపడుతున్నట్లు సీఎం వెల్లడించారు.

హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు ఇకపై అద్దె భవనాల్లో ఉండకూడదు: సీఎం రేవంత్ రెడ్డి
cm on education reforms

హైదరాబాద్, నవంబర్ 11: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష అనంతరం.. సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా విద్యారంగంలో సంస్కరణలు చేపడుతున్నట్లు సీఎం వెల్లడించారు.


‘విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా విద్యారంగంలో సంస్కరణలు చేపడుతున్నాం. ఈ క్రమంలో రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తున్నాం. ఈ మేరకు నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య.. 5 నుంచి 8 వరకు సెకండరీ.. 9 నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ విద్యాభ్యాసంగా విభజిస్తారు. పదో తరగతి తర్వాత విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గించడమే ఈ నూతన విధాన లక్ష్యం. హాస్టళ్లలో విద్యార్థులకు అన్నీ రకాల సౌకర్యాలను కల్పించాలి. ముఖ్యంగా సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు ఇకపై అద్దె భవనాల్లో ఉండకూడదు. పాఠశాలలు, హాస్టళ్లలో మరుగుదొడ్లను నిర్మించడంతో పాటు, నిరంతర నీటి వసతి కల్పించాలి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి. విద్యా సంస్థల నిర్మాణాలకు సంబంధించి నాణ్యత విషయంలో రాజీ వద్దు. ఐటీఐల తరహాలో పాలిటెక్నిక్‌లను ఆధునికీకరించాలి’ అని ముఖ్యమంత్రి విద్యాశాఖాధికారులను ఆదేశించారు.


ఇవి కూడా చదవండి...

సీఐఐ సదస్సుతో ఏపీ అభివృద్ధికి కొత్త అవకాశాలు: సీఎం చంద్రబాబు

CityofLakesగా హైదరాబాద్‌‌కు పూర్వవైభవం.. ఇదే నా సంకల్పం: సీఎం రేవంత్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 06:45 PM