Share News

డిమాండ్‌ పెరిగినా నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా

ABN , Publish Date - Nov 17 , 2026 | 04:08 AM

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

డిమాండ్‌ పెరిగినా నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా
Bhatti Vikramarka

  • రబీలోనూ ఇలాగే కొనసాగాలి: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్తు డిమాండ్‌ గరిష్ఠ స్థాయికి చేరినా ఇబ్బందులు లేకుండా సరఫరా చేయడంలో విద్యుత్తు సంస్థలు సమర్థంగా పనిచేస్తున్నాయని అభినందించారు. రానున్న రబీ సీజన్‌లోనూ రైతులు, గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు నిరంతరాయంగా విద్యుత్తు అందించాలని అధికారులను ఆదేశించారు.


రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌, సరఫరా నిర్వహణ, మౌలిక సదుపాయాల విస్తరణ, రానున్న రబీ సీజన్‌కు సన్నద్ధతపై ఆయన అధికారులతో చర్చించారు. అక్టోబరు 16న రికార్డు స్థాయిలో విద్యుత్తు డిమాండ్‌ 20,018 మెగావాట్లకు చేరుకుని గరిష్ఠ స్థాయిని నమోదు చేసిందని.. అయినప్పటికీ విద్యుత్తు సంస్థలు సమర్థంగా సరఫరా చేశాయని భట్టి చెప్పారు. రబీ సీజన్‌లో విద్యుత్తు డిమాండ్‌లో ఆకస్మిక పెరుగుదల సంభవించే పరిస్థితులను ముందుగానే అంచనా వేయాలన్నారు. ఏ ఒక్క వినియోగదారుడికీ విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 04:08 AM