Share News

క్రీడల్లో ప్రపంచంతో తెలంగాణ పోటీ

ABN , Publish Date - Oct 31 , 2026 | 05:41 AM

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో జరిగే క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం పోటీపడుతోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

క్రీడల్లో ప్రపంచంతో తెలంగాణ పోటీ
Ponguleti Srinivasa Reddy

  • క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి

  • రాష్ట్రానికి మంచి పేరు తేవాలి: మంత్రి పొంగులేటి

  • సత్తుపల్లిలో ముగిసిన రాష్ట్రస్థాయి సీనియర్‌ మహిళల కబడ్డీ టోర్నీ

సత్తుపల్లి/హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో జరిగే క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం పోటీపడుతోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మూడురోజులుగా జరుగుతున్న 73వ రాష్ట్రస్థాయి సీనియర్‌ మహిళల కబడ్డీ టోర్నీ శుక్రవారం ముగింపు కార్యక్రమానికి హాజరైన ఆయన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ప్రపంచంతో పోటీపడేలా స్పోర్ట్స్‌ హబ్‌ను నిర్మిస్తోందన్నారు. భవిష్యత్తులో దేశంతో పాటు ప్రపంచంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉండేలా ప్రణాళికలలు రూపొందిస్తున్నామని చెప్పారు. జాతీయ స్థాయిలో ఎంపికయ్యే వారంతా అక్కడ రాణించి రాష్ట్రానికి మంచి పేరు తేవాలన్నారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించే క్రమంలోనే సత్తుపల్లి మునిసిపాలిటీలో రూ.2కోట్ల వ్యయంతో ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు.


ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తే ఉపేక్షించం

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఓవైపు కఠిన చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన న్యాయపోరాటం చేస్తోందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల్ని ఎవరైనా ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. హైదరాబాద్‌ కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల విలువైన భూమికి సంబంధించి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడం ప్రభుత్వ భూముల పరిరక్షణలో కీలక విజయమని తెలిపారు. తాజాగా మియాపూర్‌ భూములపైనా సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం ప్రజాప్రభుత్వం చేపట్టిన న్యాయపోరాటానికి మరో బలమైన నిదర్శనమని ఆయన అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్యారంటీ లేకుండానే రైస్‌ మిల్లు ఆస్తుల బదిలీ

క్యాన్సర్‌ కేసుల లెక్కలు ఇకపై పక్కాగా..

బీఆర్‌ఎస్‌ కాపాడిన భూమిని.. రేవంత్‌ అమ్ముకుంటామనడం సిగ్గుచేటు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 05:41 AM