Share News

క్యాన్సర్‌ కేసుల లెక్కలు ఇకపై పక్కాగా..

ABN , Publish Date - Oct 31 , 2026 | 05:26 AM

రాష్ట్రంలో ఏటా కొత్తగా సుమారు 55 వేల క్యాన్సర్‌ కేసులు నమోదు అవుతుండగా, అందులో 35 వేల కేసులే రాష్ట్ర క్యాన్సర్‌ పోర్టల్‌లో నమోదవుతు న్నాయి. అంటే.. మూడోవంతుకుపైగా కేసుల వివరాలు ప్రభుత్వం వద్ద ఉండటం లేదు.

క్యాన్సర్‌ కేసుల లెక్కలు ఇకపై పక్కాగా..
Telangana Cancer Cases

  • ఐసీఎంఆర్‌తో కలిసి సమగ్రంగా నమోదు

  • ఆరోగ్యశ్రీలో ప్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ పరీక్షలు

  • జిల్లా స్థాయిలో కీమోథెరపీ చికిత్సల విస్తరణ

  • క్యాన్సర్‌ వైద్యసేవలపై ప్రభుత్వ సలహాదారు

  • డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు అధ్యక్షతన సమీక్ష..

  • పలు ప్రతిపాదనలు

హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏటా కొత్తగా సుమారు 55 వేల క్యాన్సర్‌ కేసులు నమోదు అవుతుండగా, అందులో 35 వేల కేసులే రాష్ట్ర క్యాన్సర్‌ పోర్టల్‌లో నమోదవుతు న్నాయి. అంటే.. మూడోవంతుకుపైగా కేసుల వివరాలు ప్రభుత్వం వద్ద ఉండటం లేదు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చివేసి, వివరాలను పకడ్బందీగా నమోదు చేయటానికి కసరత్తు మొదలు కానుంది. ఈ మేరకు అవసరమైన సహకారాన్ని భారత వైద్య పరి శోధన మండలి (ఐసీఎంఆర్‌)నుంచి తీసుకోవాలని రాష్ట్ర వైద్యశాఖ భావిస్తోంది. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ అండ్‌ రీజినల్‌ క్యాన్సర్‌ సెంటర్‌లో.. రాష్ట్రంలో ప్రభుత్వస్థాయిలో రోగులకు అందుతున్న క్యాన్సర్‌ చికిత్సపై సమీక్ష సమావేశం నిర్వహించారు. క్యాన్సర్‌ వైద్యసేవలకు సంబంధించి ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు అధ్యక్షత న ఈ సమీక్ష జరిగింది.


క్యాన్సర్‌ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించడంతోపాటు, జిల్లాస్థాయిలోనే కీమోథెరపీ చికిత్సను అందు బాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను మరిం త విస్తరించాలని ఈ భేటీలో నిర్ణయించారు. జిల్లా క్యాన్సర్‌ డే కేర్‌ సెంటర్ల పురోగతిని సమీక్షించారు. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో 3,405 కీమోథెరపీ సెషన్లు నిర్వహించారు. వీటి సంఖ్య ను పెంచటంతోపాటు రోగులకు ఇంటికి సమీపంలోనే నిరంతర చికిత్స అందించాలని, తీసుకోవాలని, వైౖద్యసేవల మధ్య సమన్వ యం పెంచేలా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు.


ఎంఎన్‌జే ఆస్పత్రికి రెండు కొత్త లినాక్స్‌లు

ఎంఎన్‌జే ఆస్పత్రిలో అందిస్తున్న అధునాతన వైద్య సేవలను సమీక్షించారు. బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ముందు రోగులకు నిర్వహించాల్సిన ప్రాథమిక పరీక్షలు, వైద్యపరమైన మూల్యాంకనా నికి అయ్యే ఖర్చులను ఆరోగ్యశ్రీ పోర్టల్‌లో చేర్చే అంశంపై చర్చిం చారు. వైద్య ప్రక్రియల ప్యాకేజీల్లో కవర్‌ కాని పరీక్షలకు సంబం ధించి అర్హులైన రోగులకు ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనలను పరిశీలించారు. ఎంఎన్‌జే ఆస్పత్రి రేడియేషన్‌ ఆంకాలజీ విభాగంలో కాలపరిమితి ముగిసిన రెండు లీనియర్‌ యాక్సిలరేటర్ల (లినాక్స్‌) స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ కార్యక్రమాల వివరాలను ఒకే కామన్‌ పోర్టల్‌లో నమోదు చేసి వాటిని సమన్వయపరచాలని అభిప్రాయపడ్డారు. ఈ సమీక్షలో ఎంఎన్‌జే డైరెక్టర్‌ డాక్టర్‌ జి.సదాశివుడు, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన

బస్సుల్లో ఢిల్లీకి తరలిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు

బీజేపీతో పొత్తుకు బీఆర్‌ఎస్‌ తహతహ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 05:26 AM