సర్ ప్రక్రియలో తప్పుడు దరఖాస్తులపై చర్యలు: సీఈవో సుదర్శన్ రెడ్డి
ABN , Publish Date - Oct 05 , 2026 | 06:28 PM
ఓటర్ల పేర్ల తొలగింపు, అభ్యంతరాల కోసం ఉద్దేశించిన ఫామ్-7లో భారీగా దరఖాస్తులు దాఖలయ్యాయి. అయితే వాటిలో కొన్ని నకిలీవని ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఈవో సుదర్శన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 5: తెలంగాణ సర్-2026పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి ఈరోజు (సోమవారం) పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ల జాబితా సవరణపై తప్పుడు ప్రకటనలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఫామ్-6, 6ఏ, 7, 8లో కావాలని తప్పుడు సమాచారం ఇస్తున్న దరఖాస్తుదారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఓటర్ల పేర్ల తొలగింపు, అభ్యంతరాల కోసం ఉద్దేశించిన ఫామ్-7లో భారీగా దరఖాస్తులు దాఖలయ్యాయి. అయితే వాటిలో కొన్ని నకిలీవని ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఈవో సుదర్శన్ రెడ్డి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఫామ్-7లో తప్పుడు సమాచారం సమర్పిస్తున్న వారిపై ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 31 ప్రకారం చర్యలు తీసుకోవాలని ఈఆర్ఓ(ERO-Electoral Registration Officer)లకు ఆయన సూచించారు. చర్యలకు ముందు విచారణ నిర్వహించాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్–1960లోని రూల్ 20 ప్రకారం విచారణ సాగాలని చెప్పారు. ఈ మేరకు జీహెమ్‌ఎమ్‌సీ కమిషనర్, హైదరాబాద్ డీఈఓతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లకు, డీఈఓలకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ వార్తలూ చదవండి
ప్రజల్లోకి ముద్రిత నకిలీ ‘ఫామ్-7’ పత్రాలు