Share News

తెలంగాణలో రైస్ మిల్లర్ల అక్రమాలపై ఈడీ కొరడా

ABN , Publish Date - Nov 23 , 2026 | 09:07 AM

తెలంగాణలో రైస్ మిల్లర్ల అక్రమాలపై ఈడీ ఉక్కుపాదం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా రూ. 6700 కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు గుర్తించిన ఈడీ.. రైస్ మిల్లర్లపై మరిన్ని కేసులు నమోదు చేసింది.

తెలంగాణలో రైస్ మిల్లర్ల అక్రమాలపై ఈడీ కొరడా
rice millers scam

హైదరాబాద్, నవంబరు 23: తెలంగాణలో రైస్ మిల్లర్ల అక్రమాలపై ఈడీ ఉక్కుపాదం మోపింది. ధాన్యాన్ని పక్కదారి పట్టించి కోట్లు గడించిన రైస్ మిల్లర్లపై మరిన్ని కేసులు నమోదు చేసింది.


రాష్ట్రంలో రైస్ మిల్లర్ల అక్రమాలపై ఈడీ కొరడా ఝుళిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ. 6,700 కోట్లు విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఇంత డబ్బును ఎక్కడికి మళ్లించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లపై ఈడీ మరిన్ని కేసులు నమోదు చేసింది. కాగా.. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ రైస్ మిల్లులో ఈడీ సోదాలు నిర్వహించి.. రూ. 30 లక్షల నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.


ఈ వార్తలూ చదవండి

పార్టీకి నష్టపరిచేలా మాట్లాడితే చర్యలు.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

పది లక్షల పుస్తకాల సేకరణే లక్ష్యం!

Updated Date - Nov 23 , 2026 | 09:33 AM