అంతర్జాతీయ మార్కెట్లలోకి తెలంగాణ ఉత్పత్తులు
ABN , Publish Date - Nov 02 , 2026 | 05:47 AM
తెలంగాణ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించడంతో పాటు, రాష్ట్ర ఎగుమతిదారులకు కొత్త వ్యాపార అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
అదే లక్ష్యంతో మెగా అవగాహన సదస్సు నేడు
వాణిజ్య శాఖ సహకారంతో టీ-హబ్‌లో నిర్వహణ
హైదరాబాద్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించడంతో పాటు, రాష్ట్ర ఎగుమతిదారులకు కొత్త వ్యాపార అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భారత్ వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) ప్రయోజనాలను రాష్ట్ర పారిశ్రామికవేత్తలకు వివరించేందుకు సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి మెగా అవగాహన సదస్సు నిర్వహించనుంది. కేంద్ర వాణిజ్య శాఖ సహకారంతో టీ-హబ్ ఫేజ్-2లో మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని నిర్వాహకులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సదస్సులో పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కీలకోపన్యాసం చేయనున్నారు. ఎఫ్‌టీఏలపై రూపొందించిన ప్రత్యేక వీడియోలను విడుదల చేయనున్నారు.
ఎగుమతిదారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ప్రతినిధులు, స్టార్ట్‌పలు, పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొంటారు. తెలంగాణలోని వివిధ రంగాలకు చెందిన ఉత్పత్తుల ఎగుమతులను పెంచుకునేందుకు ఉన్న అవకాశాలపై సదస్సులో ప్రత్యేకంగా చర్చించనున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణపై రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులకు ఉన్న అవకాశాలపై పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య వివరించనున్నారు. రాష్ట్రంలో ఎగుమతులకు అధిక అవకాశాలున్న ఐదు ప్రధాన రంగాలపై ప్రత్యేక చర్చా వేదికలు నిర్వహిస్తారు. వ్యవసాయం, రత్నాలు-ఆభరణాలు, రసాయనాలు-ఔషధాలు, ఇంజనీరింగ్-ఎలక్ట్రానిక్స్, వస్త్ర పరిశ్ర మలకు చెందిన ప్రతినిధులు ఆయా రంగాల్లో ఎగుమతుల పెంపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవగాహనతోనే సైబర్ నేరాలకు చెక్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News