Share News

ఎంఎస్ఎంఈలతోనే ఆర్థిక ప్రగతి

ABN , Publish Date - Nov 07 , 2026 | 04:38 AM

రాష్ట్ర ఆర్థిక ప్రగతి, యువతకు ఉపాధి కల్పనలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ) పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

ఎంఎస్ఎంఈలతోనే ఆర్థిక ప్రగతి
Duddilla Sridhar Babu

  • మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు

  • చర్లపల్లిలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ప్రారంభం

కుషాయిగూడ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక ప్రగతి, యువతకు ఉపాధి కల్పనలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ) పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. శుక్రవారం చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్‌-2లో రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్పొరేట్‌ సంస్థల సహకారంతో రాష్ట్రంలోని 95 ఐటీఐలను రూ. 2.5 వేల కోట్లతో ఆధునికీకరించామని తెలిపారు. 2047 నాటికి రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు.


ఈ నెల 7 నుంచి 9 వరకు ఫ్యూచర్‌ సిటీలో జరగనున్న సదస్సుకు పారిశ్రామికవేత్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని శ్రీధర్‌ బాబు కోరారు. ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ యువతకు నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి సీఎ్‌సఆర్‌ నిధులు కేటాయించాలన్నారు. కాగా, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి సహకరించిన 92 మంది దాతలను ఈ సందర్భంగా సత్కరించారు. అలాగే, పారిశ్రామికవేత్తలు రూ.18 లక్షలతో కొనుగోలు చేసి చర్లపల్లి పోలీసులకు అందించిన పెట్రోలింగ్‌ ఈవీ వాహనాన్ని మంత్రి చేతులమీదుగా అడిషనల్‌ డీసీపీ వెంకటరమణకు అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై అసెంబ్లీ!

మరో రెండు పథకాలు

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 04:38 AM