సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉద్రిక్తత.. భూముల రీ- సర్వేను అడ్డుకున్న గ్రామస్థులు
ABN , Publish Date - Sep 23 , 2026 | 04:49 PM
సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన ‘భూముల రీసర్వే’లో ఉద్రిక్తత నెలకొంది. తమ గ్రామానికి సంబంధించిన భూమిని ఎర్రవల్లి గ్రామరికార్డుల్లో కలిపారని ఆరోపిస్తూ.. శివారు వెంకటాపూర్ గ్రామస్థులు సర్వేను అడ్డుకున్నారు.
సిద్దిపేట, సెప్టెంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భూముల రీసర్వే’ను జిల్లాలోని మర్కూక్ మండల పరిధిలోని ఎర్రవల్లిలో నిర్వహించగా.. వెంకటాపూర్ గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ గ్రామానికి సంబంధించిన 113 ఎకరాల భూమిని ఎర్రవల్లి గ్రామ రికార్డుల్లో నమోదు చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఎర్రవల్లిలో రెవెన్యూ అధికారులు చేస్తున్న ఎంజాయ్‌మెంట్ సర్వేను అడ్డుకున్నారు. అనంతరం మర్కూక్ తహశీల్దార్ సరితను కలిసి వినతి పత్రం సమర్పించారు.
సర్వే నంబర్ 325లోని తమ గ్రామానికి సంబంధించిన 113 ఎకరాల భూమిని ముందుగా క్షేత్రస్థాయిలో సర్వే చేసి.. హద్దులను నిర్ధరించిన తరువాతే.. వేరే భూమిని సర్వే చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై గ్రామస్థులంతా.. నిన్న(మంగళవారం)జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందజేయగా.. ఈ రోజు(బుధవారం) కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్లను కలిసి తమ గ్రామానికి సంబంధించిన భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
అక్టోబర్‌లో స్థానిక ఎన్నికలు.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం: మంత్రి లోకేశ్
సాయికృష్ణ కేసు.. హైకోర్టు విచారణపై స్టే విధించిన సుప్రీంకోర్టు
Read Latest TG News And Telugu News