విద్యారంగాన్ని వెనక్కి తీసుకెళ్లే నిర్ణయం
ABN , Publish Date - Nov 12 , 2026 | 03:25 AM
పాఠశాల విద్యలో ఇంటర్ విద్యను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించటం దురదృష్టకరమని ప్రభుత్వ జూనియర్ కాలేజీల లెక్చరర్ల సంఘాల జేఏసీ విమర్శించింది.
పాఠశాల, ఇంటర్ విద్య విలీన నిర్ణయంపై ఇంటర్ ప్రభుత్వ లెక్చరర్ల సంఘాల జేఏసీ
హైదరాబాద్, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యలో ఇంటర్ విద్యను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించటం దురదృష్టకరమని ప్రభుత్వ జూనియర్ కాలేజీల లెక్చరర్ల సంఘాల జేఏసీ విమర్శించింది. ముఖ్యమంత్రి నిర్ణయం విద్యారంగాన్ని వెనక్కి తీసుకెళ్తుందని జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఎవరినీ సంప్రదించకుండా ఇంతపెద్ద నిర్ణయం తీసుకోవటం సరికాదని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంటర్ విద్య ప్రత్యేకంగా ఉండటం వల్లనే జేఈఈ, నీట్ లాంటి జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, విద్యావంతులతో సమగ్రంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్!
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News