ఇంటర్ విలీనంపై తొందరపాటు వద్దు
ABN , Publish Date - Nov 23 , 2026 | 04:29 AM
ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే విషయంలో ప్రభుత్వం తొందరపడొద్దని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) కోరింది.
ఉద్యోగుల సమస్యలపై స్పష్టత వచ్చాకే నిర్ణయం తీసుకోవాలి
డీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం
హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే విషయంలో ప్రభుత్వం తొందరపడొద్దని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) కోరింది. విలీనంతో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఇతర ఉద్యోగులకు ఎదురయ్యే సర్వీసు సమస్యలపై సమగ్రంగా చర్చించి, పరిష్కార మార్గాలను ఖరారు చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఆదివారం నాంపల్లిలోని టీఎన్జీవో భవనంలో జరిగిన డీటీఎఫ్ రాష్ట్ర మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య, కార్యదర్శి టి.లింగారెడ్డి మాట్లాడుతూ.. విలీనం జరిగితే ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు,స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, పీజీటీలు, టీజీటీల మధ్య సర్వీస్ పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. బోధనా అర్హతలు, విధులు, అధికారాల విభజనతో పాటు ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల నిర్వహణపై కూడా స్పష్టత అవసరమని పేర్కొన్నారు. సంబంధిత ఉద్యోగ సంఘాలు, విద్యావేత్తలు, నిపుణులతో చర్చించిన తర్వాతే విలీన ప్రక్రియ చేపట్టాలని కోరారు. మరోవైపు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వీటి పరిష్కారానికి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. ఎంపీ అరవింద్ ధ్వజం
ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై డీజీజీఐ మెరుపు దాడులు
స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.... 16 ప్రాంతాల్లో సోదాలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News