భూ భారతి ఆపరేటర్ల వేతనాలు చెల్లించండి
ABN , Publish Date - Nov 11 , 2026 | 05:39 AM
ఏడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న భూభారతి ఆపరేటర్ల వేతనాలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీఎస్ హెచ్‌ఆర్‌సీ) చైర్ పర్సన్ జస్టిస్ షమీమ్ సిఫారసు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి టీజీఎస్ హెచ్‌ఆర్‌సీ సిఫారసు
హైదరాబాద్, నవంబర్ 10 (ఆంధ్రజ్యోతి): ఏడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న భూభారతి ఆపరేటర్ల వేతనాలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీఎస్ హెచ్‌ఆర్‌సీ) చైర్ పర్సన్ జస్టిస్ షమీమ్ సిఫారసు చేశారు. కామారెడ్డి జిల్లా కొండాపూర్ వాసి పి.లింగం అనే వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదును విచారించిన కమిషన్.. దీర్ఘకాలంగా వేతనాలు నిలిపివేయడంతోపాటు వారి జీవనోపాధికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన గౌరవ ప్రదమైన జీవించే హక్కుకు విఘాతం కలిగిస్తుందని పేర్కొంది..
అక్రమ నిర్బంధంపై విచారణకు హైదరాబాద్ సీపీకి ఆదేశం
2025 అక్టోబరు 31న తనను అక్రమంగా నిర్బంధించి భౌతిక దాడి చేశారని గోల్కొండ ఎస్‌ఐపై అదే ప్రాంత వాసి షేక్ సాజిద్ అహ్మద్ చేసిన ఫిర్యాదును విచారించిన టీజీఎస్ హెచ్‌ఆర్‌సీ.. ఆయన వైద్య రికార్డుల్లో గాయాలు నమోదైన సంగతిని పరిగణనలోకి తీసుకుంది. పోలీసు అధికారిపై ఆరోపణలు చేసిన వ్యక్తిపై ప్రతిగా క్రిమినల్ కేసు నమోదు చేశారని, దీనిపై విచారించి తీసుకునే చర్యలేమిటో 6 నెలల్లో తెలపాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి.
విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!
రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్!
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News