Share News

కాళేశ్వరం కమిషన్‌పై విచారణ.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

ABN , Publish Date - Apr 21 , 2026 | 08:26 PM

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు రేపు (బుధవారం) కీలక తీర్పు ఇవ్వనుంది. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధతపై మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు సవాల్ చేసిన నేపథ్యంలో ఈ తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

కాళేశ్వరం కమిషన్‌పై విచారణ.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
Kaleshwaram Commission Case

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై ఏర్పాటు చేసిన కమిషన్‌కు సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు రేపు (బుధవారం) కీలక తీర్పు ఇవ్వనుంది. ఈ కమిషన్‌ను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ ఘోష్ నేతృత్వంలోని కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ వారు కోర్టును ఆశ్రయించారు.


ఇదిలా ఉండగా, కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రేపు (ఏప్రిల్ 22) వెలువడే తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో కోర్టు తీసుకునే నిర్ణయం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన తదుపరి పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి...

రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌‌రెడ్డి

నాకు శాపాలు పెడతారా.. కాంగ్రెస్ సర్కార్‌పై కేసీఆర్ ధ్వజం

నటి అనసూయపై అసభ్యకర పోస్టులు.. నిందితుడి అరెస్ట్

Read Latest Telangana News 

Updated Date - Apr 21 , 2026 | 08:30 PM