Share News

స్పీకర్‌ను దూషించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల అరె‌స్ట్‌కు అవకాశం ఇవ్వండి

ABN , Publish Date - Nov 03 , 2026 | 04:50 AM

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్‌ను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో నిందితులైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలను విచారణ నిమిత్తం అరె‌స్ట్‌కు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది.

స్పీకర్‌ను దూషించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల అరె‌స్ట్‌కు అవకాశం ఇవ్వండి
Telangana Government Petition

  • హైకోర్టును కోరిన ప్రభుత్వం

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్‌ను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో నిందితులైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలను విచారణ నిమిత్తం అరె‌స్ట్‌కు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. వారికి నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేయగా దాన్ని రద్దు చేయాలని కోరుతూ క్రిమినల్‌ అప్పీల్‌ దాఖలు చేసింది. దీనిపై సోమవారం జస్టిస్‌ మధుసూదన్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది.


ప్రభుత్వం, పోలీసుల తరఫున స్టేట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వర్‌రావు వాదిస్తూ.. ఇద్దరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు ఉద్దేశపూర్వకంగా స్పీకర్‌ను అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. అందువల్ల దిగువ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల తరఫు న్యాయవాది వాదిస్తూ వారు స్పీకర్‌ను దూషించలేదని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉద్యమంలోకి వెళ్లి జీవితం పాడు చేసుకున్నా!

అమిత్‌షా పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు

సందిగ్ధతకు తావు లేకుండా ఎస్సీ వర్గీకరణ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 04:50 AM