Share News

ఆ తీర్పు అమలు చేయకపోతే సీఎస్‌ హాజరు కావాల్సిందే

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:23 AM

నిజామాబాద్‌ జిల్లా డీఎస్సీ-2002 హిందీ పండిట్ల నియామక ప్రక్రియకు సంబంధించిన ఓ కోర్టు ధిక్కరణ కేసులో తీర్పు అమలు చేయకపోవడంపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆ తీర్పు  అమలు చేయకపోతే సీఎస్‌ హాజరు కావాల్సిందే
Telangana High Court

  • కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌ జిల్లా డీఎస్సీ-2002 హిందీ పండిట్ల నియామక ప్రక్రియకు సంబంధించిన ఓ కోర్టు ధిక్కరణ కేసులో తీర్పు అమలు చేయకపోవడంపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పు అమలు చేయకపోతే నవంబరు 4న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ప్రత్యక్షంగా తమ ఎదుట హాజరుకావాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శాంకోషీ, జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ల ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి హాజరుకావాలని ఆదేశించింది. విచారణను నవంబరు 4వ తేదీకి వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

జయేశ్‌ వీఆర్‌ఎస్‌!

రేషన్‌లో 6 రకాల నిత్యావసరాలు!

నేడు రాష్ట్రంలో వర్షాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 06:23 AM