తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
ABN , Publish Date - Oct 13 , 2026 | 09:26 PM
తెలంగాణ ప్రభుత్వం పోస్ట్‌మెట్రిక్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2026–27 విద్యా సంవత్సరానికి గానూ స్కాలర్‌షిప్ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 13: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. పోస్ట్ మెట్రిక్యులేషన్ విద్యార్థులకు రూ. 204.40 కోట్ల స్కాలర్‌షిప్ నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు స్కాలర్‌షిప్ వివరాలను సంక్షేమ శాఖామంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు.
2026–27 విద్యా సంవత్సరానికి గానూ.. 32,976 మంది విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్‌షిప్ నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఈ స్కాలర్‌షిప్ నిధుల్లో.. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.101.44 కోట్లు విడుదల చేయగా.. కేంద్ర ప్రభుత్వం రూ.102.96 కోట్లు విడుదల చేసిందన్నారు. మొత్తంగా రూ. 204.40 కోట్లు విడుదల అయినట్లు మంత్రి లక్ష్మణ్ వెల్లడించారు. ఈ స్కాలర్‌షిప్ నిధులు ఎస్సీ విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులకు దశలవారీగా స్కాలర్‌షిప్‌లను మంజూరు చేస్తామని.. ఆర్థిక కారణాల వల్ల ఏ విద్యార్థి కూడా ఉన్నత విద్యకు దూరం కాకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. స్కాలర్‌షిప్‌ల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీవ్యాప్తంగా 5 వేల ఆలయాల నిర్మాణమే మా లక్ష్యం:మంత్రి ఆనం
ఇంద్రకీలాద్రిపై గాయత్రీ దేవి అలంకరణలో కనకదుర్గమ్మ
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ భరత్