తెలంగాణలో పోలీసు అధికారుల బదిలీలు
ABN , Publish Date - Jan 25 , 2026 | 07:51 PM
తెలంగాణ పోలీసు శాఖలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఏసీపీ, డీఎస్పీలను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, పరిపాలనా సౌలభ్యం కోసం పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోలీసు శాఖలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఏసీపీ (ACP), డీఎస్పీ(DSP)లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, పరిపాలనా సౌలభ్యం కోసం పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతోపాటు పలు జిల్లాల అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించింది.
బదిలీ అయిన అధికారుల వివరాలివే:
హైదరాబాద్ సీసీఎస్‌లో ఏసీపీగా పనిచేస్తున్న ఎల్.ఆదినారాయణను కొత్తగూడెం డీఎస్పీగా బదిలీ చేసింది.
డీఎస్పీ అబ్దుల్ రెహ్మన్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
హైదరాబాద్ సీటీసీలో ఏసీపీగా పనిచేస్తున్న డీవీ ప్రదీప్ కుమార్ రెడ్డిని ఆదిబట్ల ఏసీపీగా ట్రాన్స్‌ఫర్ చేసింది.
సీఐడీ విభాగంలో డీఎస్పీగా ఉన్న ఎం.ఆదిమూర్తిని మియాపూర్ ట్రాఫిక్ ఏసీపీగా నియమించింది.
మల్కాజిగిరిలో ఏసీపీగా పనిచేస్తున్న ఎస్.చక్రపాణిని జవహర్‌నగర్ ఏసీపీగా ట్రాన్స్‌ఫర్ చేసింది.
ఎస్బీ ఏసీపీగా పనిచేస్తున్న మోహన్ కుమార్‌ని మేడిపల్లి ఏసీపీగా బదిలీ చేసింది.
సిద్దిపేటలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీగా పనిచేసిన బి.రవీందర్ ను భువనగిరి డీఎస్పీగా ట్రాన్స్‌ఫర్ చేసింది.
యాంటీ నార్కోటిక్ బ్యూరోలో డీఎస్పీగా ఉన్న సీహెచ్ శ్రీధర్‌ను మహంకాళి ఏసీపీగా నియమించింది.
టీజీపీఏలో డీఎస్పీగా పనిచేస్తున్న సారంగాపాణిని ఇల్లెందు డీఎస్పీగా బదిలీ చేసింది.
ఎన్.చంద్రభానుని హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
జాగృతి పార్టీలో చేరండి.. మహేశ్ గౌడ్‌కు కవిత ఆఫర్
సింగరేణి స్కాంలో రేవంత్‌రెడ్డినే లబ్ధిదారుడు: హరీశ్‌రావు
Read Latest Telangana News And Telugu News