Share News

దీపావళి కాంతులతో సుఖసంతోషాలు

ABN , Publish Date - Nov 08 , 2026 | 05:37 AM

రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా, సీఎం రేవంత్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

దీపావళి కాంతులతో సుఖసంతోషాలు
Revanth Reddy, Shiv Pratap Shukla

  • పండుగ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌, సీఎం

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా, సీఎం రేవంత్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి కాంతులు ప్రతి ఇంటా సుఖసంతోషాలను నింపాలని, ప్రజల జీవితాలు ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, శాంతిసౌభాగ్యాలతో వెల్లివిరియాలని వేర్వేరు ప్రకటనల్లో ఆకాంక్షించారు. మన సంతోషాలను ఇతరులతో పంచుకుంటూ కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచినప్పుడే పండుగకు నిజమైన సార్థకత చేకూరుతుందని గవర్నర్‌ అన్నారు.


శనివారం సాయంత్రం లోక్‌భవన్‌లో నిర్వహించిన ముందస్తు దీపావళి వేడుకల్లో గవర్నర్‌, ఆయన సతీమణి జానకీ శుక్లా అక్కడి సిబ్బందితో కలిసి బాణసంచా కాల్చారు. ప్రజల జీవితాల్లోని చీకట్లను తొలగించి, వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కూడా వేర్వేరు ప్రకటనల్లో ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సంక్రాంతి తర్వాత ప్రజాబలం

రావిర్యాల భూములు బ్లాక్‌లో

వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 05:37 AM