వైభవంగా తెలంగాణ గంగ తెప్పోత్సవం
ABN , Publish Date - Sep 07 , 2026 | 07:00 AM
తెలంగాణ గంగపుత్రుల గంగ తెప్పోత్సవం కనులపండువగా జరిగింది. ఖైరతాబాద్ ఏడుగుళ్ల నుంచిహుస్సేన్‌సాగర్ గంగమ్మ దేవాలయం వరకు పోతరాజులు, జోగినీల వీరంగాలు, సాంప్రదాయ వల పందిర్లు, బోనాలతో శోభాయాత్ర సాగింది.
హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, స్పీకర్ ప్రసాద్, మంత్రి పొన్నం
ఖైరతాబాద్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ గంగపుత్రుల గంగ తెప్పోత్సవం కనులపండువగా జరిగింది. ఖైరతాబాద్ ఏడుగుళ్ల నుంచిహుస్సేన్‌సాగర్ గంగమ్మ దేవాలయం వరకు పోతరాజులు, జోగినీల వీరంగాలు, సాంప్రదాయ వల పందిర్లు, బోనాలతో శోభాయాత్ర సాగింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శోభాయాత్రను ప్రారంభించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, నవీన్ యాదవ్, తదితరులు పాల్గొని గంగపుత్రులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఐమాక్స్ పక్కనున్న హెచ్‌ఎండిఏ గ్రౌండ్స్‌లో గంగపుత్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గంగ తెప్పోత్సవం అధ్యక్షుడు మల్కు మహేందర్‌బాబు మాట్లాడుతూ గంగ తెప్పోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇక ట్రాన్స్‌జెండర్ల ఆగడాలకు ముకుతాడు
ప్రపంచం మెచ్చేలా.. గోదావరి పుష్కరాలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News