ఇక ట్రాన్స్‌జెండర్ల ఆగడాలకు ముకుతాడు
ABN , Publish Date - Sep 07 , 2026 | 06:50 AM
ట్రాన్స్‌జెండర్ల ఆగడాలకు ముకుతాడు వేయాలని డీజీపీ సీవీ ఆనంద్ నిర్ణయించారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రాన్స్‌జెండర్ల ఆగడాల ఘటనలపై ఆయన తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా స్పందించారు.
స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సీపీలు, ఎస్పీలకు డీజీపీ ఆదేశం
సత్ప్రవర్తనతో ఉంటే ఉపాధి దాడులకు పాల్పడితే ఇక జైలుకే
హైదరాబాద్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ట్రాన్స్‌జెండర్ల ఆగడాలకు ముకుతాడు వేయాలని డీజీపీ సీవీ ఆనంద్ నిర్ణయించారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రాన్స్‌జెండర్ల ఆగడాల ఘటనలపై ఆయన తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా స్పందించారు. శుభకార్యాలు జరుపుకుంటున్న వారి ఇళ్లు, వ్యాపార సంస్ధల వద్దకొచ్చి భారీగా డబ్బు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతూ అసభ్యంతా ప్రవర్తిస్తున్న కొంతమంది ట్రాన్స్‌జెండర్లను ఇకపై ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ట్రాన్‌జెండర్ల ఆగడాలపై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలను ఆదేశించారు. తాను హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఉన్నపుడు బిక్షాటన, ట్రాన్స్‌జెండర్ల విషయమై ప్రత్యేక చర్యలు చేపట్టడంతో ఈ ఘటనలు తగ్గాయని సీవీ ఆనంద్ గుర్తు చేశారు. సమాజంలో గౌరవప్రదంగా బతకడానికి కొంత మంది ట్రాన్స్‌జెండర్లకు ట్రాఫిక్ పోలీసు, హైడ్రా విభాగాల్లో ఉద్యోగాలివ్వడంతో వారు చక్కని స్థితికి చేరుకున్నారని పేర్కొన్నారు. వీరిపై మళ్లీ ఎటువంటి ఫిర్యాదులు రాలేదని తెలిపారు. ఇప్పటికైనా గౌరవంగా బతకడానికి ముందుకు వస్తే ట్రాన్స్‌జెండర్లకు జిల్లా పోలీసులు అవకాశాలు కల్పిస్తారన్న సీవీ ఆనంద్.. దాడులు, బెదిరింపులకు పాల్పడటం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గృహ ప్రవేశాలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలతోపాటు నూతన వ్యాపారాలను ప్రారంభించిన వారి వద్దకు ట్రాన్స్‌జెండర్లు గుంపుగా వెళ్లి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తూ, దాడులకు పాల్పడిన సంఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. దీంతో ఆయా ఘటనలను పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డిసెంబరులోగా బొగ్గు ఉత్పత్తి షురూ
ప్రపంచం మెచ్చేలా.. గోదావరి పుష్కరాలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News